Shruti Haasan : హీరోల వయసు నాకు అవసరమే లేదు

సినీ ఇండస్ట్రీలోకి స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన టాలెంట్ తో పైకి వచ్చిన హీరోయిన్ శృతిహాసన్. విభిన్న పాత్రలు పోషిస్తూ, అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. మరోవైపు గ్లామర్ పరంగాను ఆడియన్స్ ను కట్టిపడేస్తోంది. గబ్బర్ సింగ్ తర్వాత మంచి హిట్ పడకపోవడంతో టాలీవుడ్ లో ఐరన్ లెగ్ గా మారింది ఈ బ్యూటీ. దీంతో టాలీవుడ్ కు దూరమైంది. ఈ విధంగా ఇండస్ట్రీకి విరామం ప్రకటించిన శృతిహాసన్, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈమెకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం శృతిహాసన్, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య‘, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాలలో నటించారు. అయితే ఈ సీనియర్ హీరోలతో ఈమె నటించడంతో తండ్రి వయసు ఉన్నవారితో నటించడం పట్ల చాలామంది ఈమెను ఈ విషయంలో ట్రోల్ చేశారు. మీమ్స్ క్రియేట్ చేసి ఆమెను ఆడుకున్నారు. అయితే తాజాగా ఈ సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతిహాసన్ తనని రోల్ చేస్తున్న వారికి తనదైన స్టైల్ లో సమాధానం చెప్పారు.

వినోద ప్రపంచంలో వయసు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే. మంచి సినిమాలో అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ప్రస్తుతం నాకు సినిమాల పరంగా గొప్ప అవకాశాలు వస్తున్నాయి. నా ముందు తరంలోని కథానాయకులు సీనియర్ హీరోల సరసన నటించి వారితో సమానమైన గుర్తింపును సంపాదించుకున్నారు. అందుకే హీరోల వయసు కంటే కథలో నా పాత్ర ప్రాధాన్యత గురించి ఆలోచిస్తా, అని చెప్పుకొచ్చింది. హీరోల వయసు నాకు అవసరమే లేదంటూ శృతిహాసన్ తేల్చి చెప్పింది.

- Advertisement -

For More Updates :

Grab Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు