Siddharth-Aditi: మరోసారి వైరల్

సినిమా ఇండస్ట్రీలో లవర్ భాయ్స్ చాలా మంది ఉన్నారు. కానీ అందులో సిద్ధార్థ్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ సిల్వర్ స్క్రిన్ లవర్ భాయ్ కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అరడజన్ మంది హీరోయిన్స్ తో ఎఫైర్ నడిపాడని ఓపెన్ గానే వార్తలు వస్తాయి. అందులో శృతి హాసన్, సమంత వంటి స్టార్లు కూడా ఉన్నారు. అనగనగా ఓ ధీరుడు చిత్రంలో శృతి హాసన్, సిద్ధార్థ్ కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనేే శృతిని సిద్ధార్థ్ లైన్లో పెట్టాడు. కొన్నేళ్ల పాటు డేటింగ్ కూడా చేశారు. ఇద్దరికీ బోర్ కొట్టడంతో విడిపోయారు.

దీని తర్వాత సిద్ధార్థ్-సమంత కలిసి నందిని రెడ్డి దర్శకత్వంలో జబర్దస్త్ అనే సినిమా చేశారు. ఈ సినిమా ఫెయిల్ అయింది. కానీ సిద్ధార్థ్-సమంత మధ్య ప్రేమ మాత్రం పాస్ అయింది. చాలా రోజుల పాటు డేటింగ్ లో ఉన్న తర్వాత సిద్ధార్థ్ మరో కన్నడ నటితో సన్నిహితంగా ఉంటున్నాడని వార్తలు వచ్చాయి. దీంతో సిద్ధార్థ్ కు సమంత దూరం అయింది. దీని తర్వాత సిద్ధార్థ్ మరికొంత మందితో ఎఫైర్ నడిపాడు. కానీ అవి పెద్దగా ప్రచారంలోకి రాలేదు. కానీ ఇప్పుడు యంగ్ హీరోయిన్ అదితీరావు హైదరీతో సాగిస్తున్న లవ్ ట్రాక్ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చర్చకు దారి తీస్తుంది.

వీరు మహాసముద్రం అనే సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుంచి వీరి మధ్య ప్రేమ చిగురించిందని టాక్. వీరి బంధం గురించి ఇది వరకే చాలా రూమర్స్ వచ్చాయి. తాజాగా ఈ రూమర్స్ కు బలం చేకూర్చేలా వీళ్లు ముంబై వీధుల్లో షీకార్లు కొడుతూ కెమెరాలకు చిక్కారు. ముంబైలోని ఒక హోటల్ వద్ద ఈ ప్రేమ జంట కనిపించారు. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా 43 ఏళ్ల ఉన్న సిద్ధార్థ్, 36 ఏళ్లు ఉన్న అదితి రావు హైదరిలకు ఇది వరకే విడివిడిగా పెళ్లిళ్లు అయ్యాయి. డైవర్స్ అయ్యాయని తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు