Kiara Advani : ఆ రహస్యం చెబుతా..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ.. తెలుగు ప్రేక్షకులకు ఈమె గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఎంఎస్ ధోని బయోపిక్ తో యూత్ కి కియారా అద్వానీ పిచ్చెక్కింది. ఇక తెలుగులో ఈ భామ కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ” భరత్ అనే నేను” చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తన నటనతోనే కాకుండా గ్లామర్ తో కూడా ఆకట్టుకుంది. తర్వాత ఈమెకు అటు బాలీవుడ్ లో, ఇటు టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ వచ్చింది. అలాగే భారీ స్థాయిలో అవకాశాలు కూడా వచ్చాయి.

అయితే కియారా అద్వానీ – సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమాయణం గురించి చాలా రోజుల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. గత కొన్నేళ్లుగా వీరు ఇద్దరూ డేటింగ్ లో ఉంటున్నారు. వీళ్లు ప్రేమ పేరుతో ముంబై మొత్తం చుట్టేశారు. ఇటీవల వీరి పెళ్లిపై కూడా చాలా వార్తలు వస్తున్నాయి. ఈ ప్రేమ జంట వచ్చే నెలలో పెళ్లి తో ఒక్కటి కాబోతున్నారని గట్టిగానే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఇందులో నిజం ఎంత ఉందనే విషయం ఎవరికీ తెలియదు. అయితే తాజాగా కియారా పెట్టిన పోస్టు పలు అనుమానాలకు కలిగిస్తుంది.

ఇంతకీ కియారా ఏం పోస్ట్ చేసిందంటే.. “ఈ విషయాన్ని ఎక్కువ కాలం రహస్యంగా ఉంచలేను. త్వరలో ఆ సీక్రెట్ చెప్పబోతున్నాను. డిసెంబర్ 2 వరకు వెయిట్ చేయండి” అని కియారా పోస్ట్ చేసింది. అంతేకాక ఈ పోస్ట్ కి జతగా ఒక వీడియోని కూడా పోస్ట్ చేసింది. దీంతో తన పెళ్లి విషయం చెప్పబోతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక కియారా ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani)

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు