Sneha : ఒక్క పోస్ట్ తో ఫుల్ క్లారిటీ

సీనియర్ హీరోయిన్ స్నేహా.. ఆనాటి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి, మూడు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. హీరోయిన్ పాత్రలు చేసిన తర్వాత సైడ్ పాత్రలు చేసింది. అందులో సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో చేసిన పాత్రకు స్నేహకు మంచి పేరు వచ్చింది. దీని తర్వాత అలాంటి పాత్రలే చేస్తూ వస్తుంది. ఇప్పుడు కూడా ఆమెకు తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో అవకాశాలు వస్తున్నాయి.

అయితే స్నేహకు 2012 లో తమిళ నటుడు ప్రసన్న కుమార్ తో పెళ్లి అయిన సంగతి విధితమే. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇది ఇలా ఉండగా కొన్ని రోజుల నుంచి స్నేహ, ప్రసన్న కుమార్ ల దాంపత్య జీవితంపై అనేక పుకార్లు వస్తున్నాయి. వీరి మధ్య తరచూ వివాదాలు వస్తున్నాయని, దీంతో ప్రసన్నకుమార్ కు దూరంగా స్నేహ ఉంటుందని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. అంతే కాదు ఈ ఇద్దరు విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్టు కూడా గుసగుసలు వినిపించాయి.

అలాగే డైవర్స్ కు కూడా అప్లే చేశారని సోషల్ మీడియా కోడై కూసింది. ఈ పుకార్లపై తాజాగా స్నేహ స్పందించింది. తన భర్త ప్రసన్న కుమార్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే కాకుండా ’ట్వినింగ్‘ అనే ఒక క్యాప్షన్ ను కూడా ఇచ్చింది. దీంతో ఇప్పటి వరకు స్నేహ, ప్రసన్న కుమార్ లు విడిపోతున్నారు అని వస్తున్న వార్తకు బ్రేకులు పడ్డాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు