Singer Sunitha : హీరోగా ఎంట్రీ..

సింగర్ సునీత.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది సునీత. తన మధురమైన గాత్రంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తూ ఎంతోమంది ప్రేక్షకులను సొంతం చేసుకుంది. ఇక ఇటీవల రామకృష్ణను రెండో వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

 మొదటి భర్తతో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన సునీత వారితో హ్యాపీగా ఉంటుంది. అయితే ఈ మధ్య సునీత తన కొడుకు ఆకాష్ ని హీరోగా పరిచయం చేయబోతుందంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా తన కొడుకు ఆకాష్ ని హీరోగా పరిచయం చేస్తున్నట్లు ప్రకటించింది సునీత.

తన కొడుకు ఆకాశ్ పుట్టినరోజు సందర్భంగా ఆకాష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ త్వరలోనే తన కొడుకు అతిపెద్ద స్టేజ్ కి వెళ్ళబోతున్నాడని.. కావున అందరూ ఆశీర్వదించాలని సోషల్ మీడియా వేదికగా కోరింది. అలాగే ఆకాష్ ఫోటోషూట్ ఫోటోలను కూడా షేర్ చేసింది సునిత. ఈ ఫోటోలను చూసిన నెటిజెన్లు ప్రేమ కథలకు బాగా సెట్ అవుతాడని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆకాష్ ఏ సినిమా చేస్తున్నాడు, డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. మరి ఆకాష్ ఏ డైరెక్టర్ చేతిలో పడతాడో, ఏ బ్యానర్ లో మూవీ చేస్తాడో చూడాలి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు