Sreeleela : దర్శకేంద్రుడి సెంటిమెంట్ మళ్లీ వర్కౌట్

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడం అంత సులువేమీ కాదు. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే నటన, ప్రేక్షకులను కట్టిపడేసేలా హవాభావాలు వ్యక్తపరచడం, అందంతో పాటు అభినయం ఉండాలి. ఇలా అన్ని ఉంటేనే హీరోయిన్ గా ఎదుగుతారు. స్టార్ ట్యాగ్ ను సంపాదించుకుంటారు. కొంత మంది హీరోయిన్లు పైన ఉన్న వాటిని సరిగ్గా పాటించినా, సరైన గుర్తింపు తెచ్చుకోలేక పోవడంతో కాల గర్భంలో కలిసిపోయారు. అందుకే వీటితో పాటు ఇండస్ట్రీలో ఎదగాలి అంటే లక్ కూడా ఉండాలి అని అంటారు.

అలా లక్ గురించి మాట్లాడుకుంటే హీరోయిన్ శ్రీలీల గుర్తొస్తోంది. కిస్ సినిమాతో సినిమాల్లోకి వచ్చిన ఈ గ్లామర్ బ్యూటీ, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్లి సందDతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా ఫలితం గురించి పక్కన పెడితే శ్రీలీల కెరీర్ కు ఈ సినిమా ఫుల్ బూస్ట్ ఇచ్చింది. ఇక్కడ ఈ యంగ్ బ్యూటీకి కలిసొచ్చే అంశం ఏంటంటే ? రాఘవేంద్ర రావు.

దర్శకేంద్రుడు తన కెరీర్ లో ఎంతో మంది నటీ నటులను స్టార్లుగా మార్చాడు. ఈయన పరిచయం చేసిన ఏ హీరో, హీరోయిన్ అయినా సినీ ఇండస్ట్రీలో మంచి పొజిషన్ కు ఎదుగుతారనే సెంటిమెంట్ ఎప్పటి నుంచో ఉంది. రాఘవేంద్రరావు సినిమాని ఎంతో రిచ్ గా ప్రెజెంట్ చేస్తారు. ముఖ్యంగా పాటల్లో హీరోయిన్లను చాలా అందంగా చూపిస్తారనే పేరు కూడా ఉంది. అందుకే ఆయన సినిమాల్లో ఒక్కసారైనా నటించాలని హీరోయిన్స్ అనుకుంటారు.

- Advertisement -

అలాంటి దర్శకేంద్రుడి తో లక్కీగా శ్రీలీల అవకాశం కొట్టేసింది. ఆమె నటన, అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది. రాఘవేంద్ర రావుతో సినిమా చేస్తే మంచి పొజిషన్ కు వెళ్తారు అనే దాన్ని శ్రీలీల వల్ల మరోసారి రుజువైంది. పెళ్లి సందD తర్వాత ఈమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఎంతగా అంటే.. డేట్స్ ఖాళీ లేవు అనే కారణం చూపి కొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను రిజక్ట్ చేసేంతా. కేవలం 21 ఏళ్ల వయసులోనే స్టార్ ట్యాగ్ ను పట్టేసుకున్న శ్రీలీల, ప్రస్తుతం టాలీవుడ్ లో దర్శక నిర్మాతలకు మొదటి ఆప్షన్ గా కనిపిస్తోంది.

ప్రస్తుతం ఈ యంగ్ బ్యూటీ చేతిలో రవితేజ ధమాకా, నితిన్ తో ఒక సినిమాతో పాటు గాలి జనార్ధన్ కుమారుడు కిరిటి హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమాలో కూడా నటిస్తోంది. తాజాగా ఈమె సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న SSMB28 లో కూడా ఛాన్స్ దక్కించుకుందని టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రావొచ్చు.

ఒక వేళ మహేష్ సినిమాలో శ్రీలీల ఫిక్స్ అయితే, ఇప్పటికే మంచి జోష్ లో ఉన్న ఆమె కెరీర్ మరింత స్పీడ్ గా మారడం ఖాయమని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు