Sreeleela: ఆ పని చేస్తూ.. సినిమాలు చేస్తున్నా

కే రాఘవేంద్రరావు సమర్పణలో వచ్చిన పెళ్లి సందD సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ ముద్దుగుమ్మ శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈమె తన అందచందాలతో, నటనతో అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇక ప్రస్తుతం శ్రీ లీల మాస్ మహారాజా రవితేజతో ధమాకా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సందర్భంగా బుధవారం ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా శ్రీ లీల విలేకరులతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ” పెళ్లి సందడి సినిమా విడుదల కాకముందే నాకు ఈ చిత్రంలో అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో ప్రణవి అనే యువతిగా నేను కనిపిస్తా. ఈ చిత్రంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తో మరింత అనుబంధం పెరిగింది. ఓవైపు ఎంబీబీఎస్ చదువుతూ.. మరోవైపు సినిమాలు చేస్తున్నా. వృత్తి, చదువు రెండింటినీ బ్యాలెన్స్ చేయడం అలవాటయింది. మా అమ్మ కూడా వైద్యురాలే. మా అమ్మ సహకారం నాకు చాలా ఉంది. రవితేజకు నేను పెద్ద అభిమానిని. ఆయనతో పనిచేస్తున్న కొద్ది నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. తోటి నటుల్ని ఆయన ఎంతగానో ప్రోత్సహిస్తుంటారు” అని చెప్పింది శ్రీ లీల.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు