Dasara: అప్పుడు గురు.. ఇప్పుడు శిష్యుడు

సుకుమార్.. ఈ పేరు గురించి కొత్తగా పరిచయం చేయ్యాల్సిన అవసరం లేదు. తన మొదటి సినిమా ఆర్య తోనే అదిరిపోయే హిట్ అందుకుని ఒక సరికొత్త ఫిలిం మేకర్ ఇండస్ట్రీకి దక్కాడు అనిపించుకున్నాడు. ఒక ప్రేమకథను ఇలా కూడా చెప్పొచ్చు. ఒక అందమైన కావ్యంలా వెండితెరపై ఆవిష్కరించొచ్చు అని నిరూపించాడు సుకుమార్.

“ఆర్య” సినిమా నుంచి “నాన్నకు ప్రేమతో..” సినిమా వరకు వచ్చిన ప్రతి సినిమా తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకుంది. కానీ రామ్ చరణ్ ను హీరోగా పెట్టి చేసిన “రంగస్థలం” సినిమా మాత్రం అంతకుమించి అని చెప్పొచ్చు. అసలు రామ్ చరణ్ లో ఇంత గొప్ప నటుడు ఉన్నాడని ప్రూవ్ చేసింది రంగస్థలం. ఎప్పుడు క్లాస్ సినిమాలు తీసే సుకుమార్ ఒక మాస్ కమర్షియల్ సినిమాను ఏ రేంజ్ లో తియ్యగలడో ఆ సినిమాతో అందరికి అర్ధమైంది. మార్చ్ 30 2018 లో రిలీజైన ఈ సినిమా అందరిని సప్రెజ్ చేసింది.

ఇకపోతే రీసెంట్ గా రిలీజైన “దసరా” సినిమాకి మంచి హైప్ వచ్చి కలక్షన్స్ వర్షం కురిపిస్తుంది. ఈ సినిమాలో నాని నెవర్ బిఫోర్ అవతార్ లో కనిపించాడు. వీటన్నిటిని మించి ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు తెరకెక్కించడం విశేషం. సుకుమార్ దర్శకత్వం
రంగస్థలం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసాడు శ్రీకాంత్. అప్పుడు చరణ్ ను సుకుమార్ నెవర్ బిఫోర్ అవతార్, ఇప్పుడు సుక్కు శిష్యుడు శ్రీకాంత్ నానిని నెవర్ బిఫోర్ అవతార్ లో చూపించాడు. ఈ సినిమాలు ఒకే తారీఖున రిలీజ్ అవ్వడం యాదృచ్చికం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు