Sreeleela : ప్రేమలో పడింది

ప్రేక్షకుల్లో జోష్ నింపేందుకు “ధమాకా” మూవీతో రవితేజ రెడీ అవుతున్నారు. రవితేజ మార్క్ కామెడీ అంశాలతో మాస్ ఎంటర్టైనర్ గా తెరకేక్కుతున్న ఈ చిత్రానికి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజకు జోడిగా శ్రీ లీల నటిస్తోంది. పెళ్లి సందడితో కథానాయకగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల కు ఇది రెండో సినిమా. ప్రసన్నకుమార్ బెజవాడ కథను అందిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ధమాకా సాంగ్ ఆడియన్స్ ను అలరించి సినిమాపై అంచనాలను పెంచేసాయి. తాజాగా మరో అప్డేట్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది చిత్ర బృందం. ధమాకా సినిమా నుంచి మరో పాట విడుదల చేసింది. వాట్స్ హ్యాపెనింగ్ అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటుంది. మెలోడీగా సాగే ఈ పాట శ్రోతలను అలరిస్తోంది. శ్రీ లీల డ్యాన్స్, పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.

రవితేజ తో ఆమె కెమిస్ట్రీ బాగుంది. ఆధ్యాంతం వినసొంపుగా, అలాగే ట్రెండీగా ఉన్న ఈ పాటకు నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ ట్రెండీ సాంగ్ ను ప్రముఖ గాయకులు రమ్య బెహరా, భార్గవి పిళ్లయి ఆలపించారు. బీమ్స్ సేసిరోలియో స్వరాలను సమకూర్చారు. ఈ పాటను రామ జోగయ్య శాస్త్రి రాశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదలై ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా మాస్ రాజా అంటూ సాగే సాంగ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు