Sreeleela : పెంచేసిందిగా !

టాలీవుడ్ ఇండ‌స్ట్రీ లోకి  హీరోలు, హీరోయిన్లు వ‌రుస‌గా వ‌స్తూ పోతుంటారు. వారిలో కొంత మంది మాత్ర‌మే నిల‌దొక్కుకుంటారు. కొంత మంది ఉన్న కొద్ది రోజుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. మరికొందరూ  వ‌రుస ఆఫ‌ర్లు అందుకుంటూ కొంద‌రూ రాణిస్తుంటారు. అలాంటి వారిలో అందాల తార శ్రీ‌లీల ఒక‌రు. ముఖ్యంగా ఈమె అందం, అభిన‌యం, చ‌లాకిత‌నంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుందనే చెప్పవచ్చు. దర్శకేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో తెర‌కెక్కిన ‘పెళ్లిసంద‌D’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

మొద‌టి సినిమాతో మంచి హిట్ అందుకున్న శ్రీ‌లీల తెలుగులో వ‌రుస ఆఫ‌ర్ల‌ను అందుకుంటుంది. తెలుగులో మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న ‘ధ‌మాకా’లో న‌టిస్తోంది. ఈ చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ప్ర‌స్తుతం ఈమెకు వ‌రుస ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్నాయ‌ని తెలుస్తోంది. ఇప్పుడు ఈమె చేతిలో ఏకంగా 7 సినిమాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. ర‌వితేజ‌, బాల‌కృష్ణ‌, వైష్ణ‌వ్‌తేజ్‌, శ‌ర్వానంద్‌, నితిన్ సినిమాల్లో ఈ బ్యూటీ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌డం విశేషం.

ఈమె వ‌రుస సినిమాల‌తో దూసుకువెళ్తోంది. అటు సీనియ‌ర్ హీరోల‌తో.. ఇటు యంగ్ హీరోల‌తో న‌టిస్తూ త‌న క్రేజ్ పెంచుకుంటుంది శ్రీ‌లీల‌. ఈమ‌ధ్య వ‌రుస సినిమాల‌తో బిజీ అవ్వ‌డ‌మే కాకుండా రెమ్యున‌రేష‌న్ కూడా పెంచేసింద‌ట ఈ బ్యూటీ. అతి త‌క్కువ స‌మ‌యంలోనే వ‌రుస సినిమాల‌తో ఆఫ‌ర్లు అందుకున్న ఈ బ్యూటీ మ‌రో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతుందేమో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు