SSMB28: ఉగాదికి ఫస్ట్ లుక్?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించిన అతడు, ఖలేజా రెండు సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా వస్తుంది. SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకేక్కుతోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను కూడా ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ లీల సెకండ్ హీరోయిన్ గా కనిపించబోతున్నది.

తొలుత ఈ సినిమాను ఏప్రిల్ 28న రిలీజ్ చేయాలని భావించారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఆగస్టుకు పోస్ట్ పోన్ చేశారు. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం మ్యూజిక్ సెట్టింగ్స్ జరుగుతున్నట్లు సమాచారం. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 28వ సినిమా ఇది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం, ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మార్చి 22న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తారని, అదే రోజు టైటిల్ ను ప్రకటిస్తారని సమాచారం. తనదైన శైలి, వినోదం, భావోద్వేగాలతో చక్కటి కుటుంబ కథతో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు అయోధ్యలో అర్జునుడు అనే టైటిల్ ను ఖరారు చేయొచ్చని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ టైటిల్ తో పాటు మరికొన్ని టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని తెలిసింది. ఈ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు