SSMB29: ముహూర్తం ఫిక్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా SSMB29. కెరీర్ లో ఒక్క అపజయం లేకుండా వరుసగా పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తూ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఆఫ్రికా అడవుల్లో ఈ చిత్రం ఉంటుందని ప్రపంచ స్థాయి అడ్వెంచర్ గా ఈ చిత్రం తెరకెక్కించబోతున్నట్లు జక్కన్న ఇప్పటికే ప్రకటించారు. అంతేకాకుండా ఫ్రాంచైజీ గా రాజమౌళి చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. అయితే ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఆ సినిమా సెట్స్ మీదకి వెళ్ళేది ఎప్పుడా అని అంతా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ గుడ్ న్యూస్ బయటకు వచ్చింది.

మహేష్, రాజమౌళి కాంబినేషన్లో ఈ చిత్రం జనవరిలో మొదలు కావాల్సి ఉందని వార్తలు వచ్చాయి. అది కుదరకపోవడంతో ఫిబ్రవరిలో పూజ కార్యక్రమాలు మొదలవుతాయని వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొట్టింది. తాజా సమాచారం ప్రకారం మార్చిలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభించడానికి ముహూర్తం కుదిరిందని చిత్రబృందం నుంచి సమాచారం. కాగా ప్రస్తుతం మహేష్, త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నారు. మార్చి నుంచి రాజమౌళి సినిమా కోసం డేట్లు కేటాయించారని, రెండు సినిమాలకు మహేష్ షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రాన్ని కేఎల్ నారాయణ నిర్మించనున్నారు.

- Advertisement -

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు