Harish Shankar: స్టార్ డైరెక్టర్ రిలీజ్ చేసిన “రిచి గాడి పెళ్లి” ట్రైలర్

కె.ఎస్.ఫిల్మ్ వర్క్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న చిత్రం “రిచి గాడి పెళ్లి”. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. నవీన్ నేని, ప్రణీత పట్నాయక్ ప్రధాన తారాగణంగా కెఎస్ హేమరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ లాంచ్ చేసారు. రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ చూస్తుంటే చిన్నప్పుడు బల్లల మీద ఆడుకున్న చిన్న చిన్న ఆటలను ఆధారం చేసుకుని తీసిన సినిమా ఇది అని అర్ధమవుతుంది. ఆ చిన్న ఆట వల్ల జీవితాలు ఎలా మలుపులు తిరిగాయనేదే ఈ సినిమా కథాంశం.

దర్శకుడు కె యస్ హేమరాజ్.. “రిచి గాడి పెళ్లి” అనేది మానవ సంబంధాలకు అద్దంపట్టే కథ అని అన్నారు. ప్రతి పాత్రలో వేరియేషన్ ఉండేలా డిజైన్ చేసినట్టు ఇదివరకే చెప్పుకొచ్చారు. ఆ మాదిరిగానే ట్రైలర్ ను డిజైన్ చేసారు చిత్ర బృందం. త్వరలో ఈ సినిమా రిలీజ్ కి సిద్దమవుతుంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు