Nagarjuna : ఘోస్ట్ కోసం స్టార్లు..

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ ఏడాది ఫుల్ జోష్ లో ఉన్నారు. వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు సవాల్ గా మారుతున్నారు. ఈ ఏడాదిలో నాగార్జున నటించిన బంగార్రాజు, బ్రహ్మస్త్ర సినిమాలు విడుదల అయ్యాయి. తాజాగా మరో సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. నాగ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగ్ కు జోడీ సోనాల్ చౌహాన్ నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం ప్రమోషన్ పనులు చేసుకుంటుంది. దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ విడుదలకు సిద్ధమైంది. అందుకోసం చిత్ర యూనిట్ ప్రమోషనల్ పనులు కూడా ప్రారంభించారు. ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్, తమహాగానే థీమ్ సినిమాపై కొంత వరకు ఇంట్రెస్ట్ పెంచాయి. ఈ ఇంట్రెస్ట్ ను మరింత పెంచేందుకు టీం దూకుడు వెళ్తుంది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈవెంట్ ను కర్నూల్ లోని ఎస్టీబీసీ కాలేజ్ గ్రాండ్ లో జరగనుంది. దీనికి సంబంధించి ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో గన్ పట్టుకుని నిల్చున్నాడు. అయితే ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి, దర్శకధీరుడు రాజమౌళి కలిసి వస్తున్నట్లు సమాచారం అందుతుంది. దీనిపై అధికారిక ప్రకటన రాలేకపోయినా, దాదాపు ఖాయమని తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు