Suhas : మేజర్ మాదిరిగా …

తక్కువ సమయంలోనే ఎక్కువ స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోలలో సుహాస్ ఒకరు. కలర్ ఫొటోతో హీరోగా పరిచయమై ఒక కొత్త గుర్తింపును తెచ్చుకున్నాడు. కొత్త కథలని మరియు దర్శకులని ఎంచుకుంటూ మంచి హిట్స్ ను కెరియర్ లో ముందుకు వెళ్తున్నాడు సుహాస్. వరుస సినీమాలతో ప్రేక్షకులని అలరిస్తున్న సుహాస్ ప్రస్తుతం “ఆనంద్ రావు అడ్వెంచర్స్” అనే సినిమా షూటింగ్ దశలో ఉండగానే “రైటర్ పద్మభూషణ్” రిలీజ్ కు రెడీ అవుతుంది.

ఈ మధ్య చాలా సినిమాలు రిలీజ్ డేట్ కన్న ముందు ప్రీమియర్ షోస్ ను థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. అడవి శేష్ నటించిన మేజర్, కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి కి బ్లాస్క్ బస్టర్ అందించిన “చార్లీ 777” సినిమాలు ప్రీమియర్ షోస్ ను రిలీజ్ ముందుగానే కొన్ని ప్రాంతాల్లో ప్రదర్శించారు.

ప్రస్తుతం అదే మాదిరిగా “రైటర్ పద్మభూషణ్” చిత్ర యూనిట్ కూడా నడుస్తుంది. తాజాగా ఈ చిత్రం ప్రీమియర్ డేట్స్ ను రిలీజ్ చేసింది. ఈ నెల 27న విజయవాడ లో, 28న గుంటూరులో, భీమవరంలో 29 రోజున ప్రీమియర్ షోస్ తో అలరించబోతున్నారు. వీటితో పాటు 30న కాకినాడలో, సాగర తీరం అయిన విశాఖపట్టణం లో 31 రోజు, మరియు చివరగా హైదరాబాద్ లో ఫిబ్రవరి 1 రోజున ఈ చిత్రం ప్రీమియం షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 3న అని థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

- Advertisement -

For More Updates :
Check out Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు