Suhas: పద్మభూషణ్ వచ్చేది అప్పుడే

ఛాయ్ బిస్కట్ యూ ట్యూబ్ వీడియోలతో తన యాక్టింగ్ కెరీర్ ను ప్రారంభించాడు సుహాస్.తన సినిమా సెలక్షన్స్ తో, టాలెంట్ తో తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. తన అద్భుతమైన నటన తో ‘కలర్ ఫోటో’ సినిమా తో పేక్షకులని అలరించి నేషనల్ అవార్డు ని కూడా అందుకున్నాడు సుహాస్.

ఇప్పుడు తాజా గా ‘హిట్ 2’ సినిమా లో కనిపించి ఒక్కసారిగా ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసాడు. తన అపకమింగ్ సినిమా అయినా ”రైటర్ పద్మభూషణ్” అనే ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో స్ట్రగ్గ్లింగ్ రైటర్ గా కనిపించనున్నాడు. దీని రిలీజ్ డేట్ కుడా అనౌన్స్ చేయటం జరిగింది.

రైటర్ పద్మభూషణ్ ఫిబ్రవరి 3న తెరమీదకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్ లో సుహాస్ ప్రకాశం బ్యారేజ్ మీద ఎన్నో కలలు , ఆశయాలు ఉన్న ఒక యువకుడిలా ఉండటం కనిపిస్తుంది.

- Advertisement -

ఈ సినిమాలో టీనా శిల్పారాజ్ హీరోయిన్ గా నటించింది, దర్శకుడిగా తన డెబ్యూని సుహాస్ తో ప్రారంభించారు షణ్ముఖ్ ప్రశాంత్. ఈ సినిమా ని అనురాగ్ రెడ్డి,శరత్ చంద్ర మరియు చంద్రు మనోహర్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు, అలాగే శేఖర్ చంద్ర , కళ్యాణ్ నాయక్ సంగీతాన్ని అందింస్తున్నారు. ఇదివరకే ఈ చితం నుండి రిలీజైన ”కన్నుల్లో నీ రూపమే” సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వెంకట్ ఆర్ శాఖమూరి సినిమాటోగ్రఫీ కి బాధ్యత వహిస్తున్నారు. మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ను త్వరలోనే విడుదల చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు