Naatu Naatu: నాడు నాటు నేడు గ్రేటు

ఎస్ ఎస్ రాజమౌళి… ఇది కేవలం పేరు మాత్రమే కాదు ఇదొక ప్రభంజనం. తెలుగు సినిమా స్థాయిని శిఖరం మీద కూర్చోబెట్టిన దిగ్గజ దర్శకుడు. ఓటమి ఎరుగని దర్శక ధీరుడు. ఇప్పటివరకు రాజమౌళి చేసిన ప్రతి సినిమా హిట్ అయి రాజమౌళి స్థాయిని పెంచింది. ఒక హీరోకి అదిరిపోయే ఎలివేషన్ ఇవ్వాలన్న ఒక సాంగ్ ను అందంగా చూపించాలన్న రాజమౌళి తర్వాతే ఎవరైనా అనిపిస్తుంది. మన తెలుగు సినిమాను ఎల్లలు దాటించి ప్రపంచ సినిమాలో మనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచిన ఘనత ముమ్మాటికీ ఆయనదే.

తెలుగు సినిమా, తమిళ్ సినిమా, మలయాళం సినిమా అని కాకుండా ఇప్పుడు ప్రపంచం అంతా ఇండియన్ సినిమా అని మాట్లాడుకునే స్థాయిలో తమ హావాను చూపించాయి పుష్ప మరియు ట్రిపుల్ ఆర్ చిత్రాలు. ఈ రెండు చిత్రాలలోని పాటలు కూడా కీలక పాత్రను పోషించాయి. ఇక పుష్ప చిత్రంలోని అన్ని పాటలను ప్రముఖ సాహిత్య రచయిత చంద్రబోస్ రాసారు.

అలానే ఇటీవలే ఆస్కార్ కి నామినేట్ అయినా ట్రిపుల్ ఆర్ చిత్రంలోని “నాటు నాటు” పాటను రచించారు చంద్రబోస్. ఎమ్ ఎమ్ కీరవాణి ట్రిపుల్ ఆర్ చిత్రానికి అందించిన సంగీతం, బాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పటికి మన చెవుల్లో మార్మోమోగుతుంది. సినిమాలో కుంభస్థలాన్ని బద్దలు కొడదాం అని చెప్పినట్లు, ఇప్పుడు వాస్తవిక జీవితంలో నాటు నాటు పాటతో వరుస రికార్డ్స్ ను కొడుతున్నారు. సంగీత దర్శకులు కీరవాణి మరియు సాహిత్య రచయిత చంద్రబోస్.

- Advertisement -

ఒకప్పుడు మనమధ్య ఆస్కార్ అనే చర్చ రావడమే అరుదైన విషయం . అలాంటిది నేడు ఆస్కార్ బరిలో ఒక తెలుగు సినిమాలోని పాట ఉంది అంటే దాని గురించి చెప్పడం వర్ణనాతీతం. “కాలు సిందు తొక్కేలా దుమ్మారం రేగినట్టు” అని ఈ పాటలో చంద్రబోస్ రాసినట్టు ఒక తెలుగు పాట నిజంగానే సిందులు తొక్కుతూ ఖండాతరాలను దాటుతూ ఇప్పటికి దూమారం రేపుతుంది. అంతేకాకుండా ఎన్నో అవార్డ్స్ ను సొంతం చేసుకుంటుంది.

గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ చాయిస్, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియన్ అవార్డ్స్, గోల్డెన్ డెర్బీ వంటి పురస్కారాలు నాటు నాటు పాటకు అందాయి. ఈ సందర్భంగా సాహిత్య రచయిత చంద్రబోస్ కి ఎంతో సన్నిహితులైన సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ మరియు దర్శకులు సుకుమార్ చంద్రబోస్ ను అభినందించారు.

దేవి శ్రీ ప్రసాద్, చంద్రబోస్ , సుకుమార్ కలయికలో వచ్చిన పాటలు గురించి పెద్దగా, కొత్తగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎంత చెప్పినా ఎంతోకొంత మిగిలి ఉండే అద్భుతమైన పాటలు వీరి కలయికలో వచ్చాయి. పైకి విసిరినది కింద పడును అని తెలిపే గ్రావిటేషన్ అంటూ తెలుగు సాహిత్యాన్ని ఇలా కూడా రాయొచ్చు అని ఒక నావిగేషన్ చూపించడానికి ఒక సాహిత్య రచయిత కి ఇచ్చిన ఫ్రీడమ్ లోని దర్శకుడు సుకుమార్ యొక్క గొప్పతనం అర్ధమవుతుంది.

ఏదేమైనా ఇద్దరు యంగ్ హీరోలు సోదరులుగా కనిపిస్తూ నాటు నాటు కి డాన్స్ వేయాలన్న, మెగాస్టార్ లాంటి స్టార్ హీరోతో “పలు జాతులు భిన్నత్వం కనిపిస్తున్న, కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్న, ఎందుకు మాకి హింస వాదం? నేర్పరా మాకు సోదరా భావం” అని అలవోకగా రాయడం, చంద్రబోస్ కి పెన్నుతో పెట్టిన విద్య.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు