Suneel:మరో బంపర్ ఆఫర్

కమెడియన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా తన యాక్టింగ్ తో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న సునీల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం విలన్ పాత్రలు చేస్తూ తన కెరీర్ ని ముందుకు తీసుకు వెళుతున్నాడు సునీల్.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో ”మంగళం శ్రీను” పాత్రలో సునీల్ నటనకు మంచి గుర్తింపు దక్కింది. దీంతో సునీల్ కు ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులలో అవకాశాలు లభిస్తున్నాయి.

ఈ టాలెంటెడ్ యాక్టర్ ప్రస్తుతం ఓ భారీ ప్రాజెక్టులో నటిస్తున్నాడు. అది కూడా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో చేస్తున్నాడు. రజనీకాంత్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెట్స్ నుంచి సునీల్ లుక్ ని తాజాగా మేకర్స్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

ఈ చిత్రంలో సునీల్ తో పాటు కన్నడ అగ్ర నటుడు శివరాజ్ కుమార్, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అంతేకాక ఈ చిత్రంలో రమ్యకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో తమిళ సినిమాలో కూడా సునీల్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.

తమిళ హీరో విశాల్ నటిస్తున్న “మార్క్ ఆంటోనీ” అనే సినిమాలో సునీల్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమిళ దర్శకుడు ఎస్ వినోద్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకునేందుకు విశాల్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో సునీల్ ఓ మేజర్ రోల్ లో నటించే ఆఫర్ ని పొందాడు. ఇక ఈ సినిమాలో సునీల్ పాత్ర ఎలా ఉండబోతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు