Krishna : శ్వాసకోస సమస్యతో..

సీనియర్ హీరోల్లో సూపర్ స్టార్ కృష్ణ కు ప్రత్యేక స్థానం ఉంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో సమానంగా పోటీ ఇస్తూ ఎన్నో విజయాలను తెలుగు సినీ పరిశ్రమకు అందించాడు. అయితే ప్రస్తుతం వయసు మీద పడటంతో ఇంటికే పరిమితం అయ్యారు. ఆయన రెండో భార్య విజయ నిర్మల 2019లో, ఇటీవల మొదటి భార్య ఇందిరా దేవీ మరణించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ రోజు ఉదయం సూపర్ స్టార్ కృష్ణ ఆస్వస్థతకు గురి అయిన విషయం తెలిసిందే.

ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. తాజాగా గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఒక అప్డేట్ ను అందించారు. ఈ అప్డేట్ ప్రకారం.. సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆయన రెగ్యూలర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వచ్చారని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా, దిగ్గజ హీరో కృష్ణ గత కొన్ని రోజుల నుంచి శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది.

దాని కోసమే ఈ రోజు ఉదయం గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి వచ్చారట. ప్రస్తుతం కృష్ణ ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నట్టు సమాచారం. 24 గంటల తర్వాత ఈ సీనియర్ హీరోని డిశ్చార్జీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ అప్డేట్ తో సూపర్ స్టార్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు