వణక్కం సూపర్ స్టార్

మన తెలుగు హీరోలకి తమిళ్ డైరెక్టర్స్ అంటే ఒకప్పుడు మోజు
నడిగిరిక్కి వణక్కం
మీరేనా సెంథిల్
అమా నాన్ దా
స్టోరీ చెప్పండి
ఇది ఎన్నానా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ , మహేష్ ఎల్లం అడిగారు
నాన్ నో సొన్నా…
ఈ పాటికే మీకు నేనింతే లో వేణు మాధవ్ గుర్తొచ్చి ఉంటాడు.
అప్పట్లో తమిళ డైరెక్టర్స్ కి ఎక్కువ అవకాశాలు ఇచ్చేవారు తెలుగు హీరోలు, డైరెక్టర్స్ కి మాత్రమే అనుకుంటే పొరపాటే ఆ హీరోలకి కి కూడా ఇక్కడ బ్రహ్మరధం పట్టేవాళ్ళు.శింబు , సూర్య ,కార్తీ సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు చూసేవాళ్ళు.

ఇప్పుడు తమిళ్ హీరో విజయ్ సినిమాలుకు ఇక్కడ మంచి ఆదరణ లభిస్తుంది. రీసెంట్ గా రిలీజైన బీస్ట్ సినిమాకి కూడా ఎర్లీ మార్నింగ్ షోస్ పడ్డాయి హైదరాబాద్లో ,కనీసం ఈ సినిమా ప్రమోషన్స్ కి కూడా విజయ్ హైదరాబాద్ రాలేదు. కానీ తెలుగు సినిమాలకు మాత్రం తమిళనాడులో ఆదరణ తక్కువ. ఇప్పటివరకు రాజమౌళి నుంచి వచ్చిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ కొంతవరకు మంచి గౌరవం దక్కింది. మగధీర, ఈగ లాంటి సినిమాలను డబ్బింగ్ చేస్తే అవి నామ మాత్రంగానే ఆడాయి. వీటి పరిస్థితి ఇలా ఉంటే ఇక స్ట్రెయిట్ గా రిలీజ్ చేసే టాలీవుడ్ మూవీస్ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ సర్కారు వారి పాట ఈ ట్రెండ్ ని బ్రేక్ చేసింది.

చెన్నైలోని రోహిణి సిల్వర్ స్క్రీన్ థియేటర్లో తెల్లవారుఝామున 4 గంటలకు ఫ్యాన్స్ బెనిఫిట్ షో వేయబోతున్నట్టు ఆ యాజమాన్యం ప్రకటించింది. ఏదో మాములు థియేటర్లో ఈ ప్రీమియర్ వేస్తే అది పెద్ద టాపిక్ కాదు, కానీ మూడు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న రోహిణి థియేటర్ లో షో అంటే ఇది ప్రత్యేకమైన విషయమే. బేసిక్ గా ఆ థియేటర్ లో కేవలం విజయ్, అజిత్, రజినీకాంత్ సినిమాలకు మాత్రమే నాలుగు గంటలకు స్పెషల్ షోలు వేస్తారు. అలాంటిది సర్కారు వారి పాటకు నేరుగా తెలుగు వెర్షనే వేయడం అది ఒక సరికొత్త రికార్డ్ అని చెప్పొచ్చు. ఎవరిని అంతగా లెక్కచేయని తమిళ్ ఆడియన్స్ ఒక తెలుగు సినిమాకి ఇంతలా బ్రహ్మరధం పట్టడం అరుదైన విషయం. ఇంతకు ముందు స్పెడర్ సినిమా ప్రమోషన్స్ లో మహేష్ తమిళ్ ఆడియన్స్ కి దగ్గర కావడం కూడా దీనికి కారణం కావొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు