Suriya42 : షాకింగ్ ప్రకటన..

కోలీవుడ్ స్టార్ సూర్య అంటే ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 1997లో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన సూర్య శివ కుమార్ నేషనల్ అవార్డ్ గెలుచుకునే స్థాయి వరకు ఎదిగాడు. అంతే కాదు.. కోలీవుడ్ టాప్ హీరోగా కూడా ఎదిగాడు. ఆయన ఇటీవల నటించిన ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా కరోనా మహమ్మారి సమయంలో డైరెక్ట్ ఓటీటీగా రిలీజ్ అయ్యాయి. ఒక వేళ ఈ రెండు సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయి ఉంటే బాక్సా ఫీస్ వద్ద సన్సెషన్ క్రియేట్ అయ్యేది.

కాగా సూర్య చివరి సారిగా ఈటీ అనే సినిమా చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చూసింది. దీని తర్వాత సూర్య బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇదిఇలా ఉండగా సూర్య తన కెరీర్ లో 42వ చిత్రాన్ని బాలాతో చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి వనన్ గాన్ అనే టైటిల్ ను కూడా పెట్టారు. అంతేకాదు.. ఏకంగా 40 శాతం షూటింగ్ ను కూడా పూర్తి చేశారు. అయితే ఈ రోజు మూవీ యూనిట్ నుంచి షాకింగ్ న్యూష్ వచ్చింది.

వనన్ గాన్ నుంచి సూర్య తప్పుకున్నాడని దర్శకుడు బాలా అధికారికంగా ప్రకటించాడు. స్టోరీ సూర్య సరిపోయేది కాదని, అందుకే కష్టమైన ఈ నిర్ణయం తీసుకున్నామని బాలా చెప్పుకొచ్చాడు. వనన్ గాన్ చిత్రాన్ని త్వరలోనే ఒక కొత్త హీరోతో తెరకెక్కిస్తాని బాలా ప్రకటించాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు