Tamannah: కెరీర్ ప్రారంభంలో మిల్క్ బ్యూటీ రెమ్యూనరేషన్ మరీ ఇంత తక్కువా ?

టాలీవుడ్ లో చాలామంది హీరోయిన్లు ఉన్నారు. కానీ మిల్క్ బ్యూటీ తమన్నాకి మాత్రం ఒక ప్రత్యేక స్థానం ఉంది. హీరోయిన్లలో అందరికన్నా తమన్నాకు క్రేజ్ ఎక్కువ. అలాంటి ఈ మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అంద చందాలతో యువతను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి శ్రీ అనే సినిమా ద్వారా అడుగుపెట్టి ఆ తర్వాత హ్యాపీడేస్ చిత్రంలో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది.

ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకొని స్టార్ హీరోలు అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్అయిపొయింది. దాంతో మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఈమె ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 19 సంవత్సరాలు దాటిపోయింది. పదో తరగతి చదివే సమయంలోనే ఈమెకు తెలుగులో ఆఫర్ వచ్చింది. దీంతోపాటు యాడ్స్ చేసే అవకాశం కూడా దక్కించుకుంది. ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకి రూ. 4 నుండి రూ 5 కోట్ల పారితోషికం తీసుకుంటుంది.

ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్ లో నటిస్తే కోటి రూపాయలకు పైగా పారితోషికం అందుకుంటున్న తమన్నా మొదటిసారి చేసిన యాడ్ కు సుమారుగా లక్ష రూపాయలు తీసుకుందట. 2005లో జరిగిన ఈ యాడ్ కోసం మూడు రోజులు షూట్ చేసే లక్ష రూపాయల పారితోషికం అందుకుంది తమన్నా. ఇదే విషయాన్ని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పింది తమన్నా. తనకు వచ్చిన ఆ లక్ష రూపాయలను ఫ్యామిలీతోనే ఖర్చు చేసినట్లు చెప్పింది మిల్కీ బ్యూటీ. కాగా ఈ మధ్యకాలంలో ఓ బాలీవుడ్ హీరోతో తమన్నా బాగా తిరుగుతుందని… అతన్నే పెళ్లి చేసుకుంటుందని కూడా వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు