Tamanna: మరోసారి బాయ్ ఫ్రెండ్‌తో అడ్డంగా దొరికిపోయిన హీరోయిన్..! ఈ సారి హైలైట్ ఏంటంటే ?

గత కొద్ది రోజులుగా మిల్కీ బ్యూటీ తమన్నా – బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది న్యూ ఇయర్ పార్టీలో వీరిద్దరూ ముద్దు పెట్టుకున్న వీడియోలు వైరల్ కావడం సంచలనం రేపింది. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారన్న రూమర్స్ పై ఇప్పటివరకు నోరు తెరిచి చెప్పలేదు. మొదట్లో గుట్టుగా ఉంచారు కానీ ఇప్పుడు తమ చేతుల ద్వారా ప్రేమలో ఉన్నట్టు హింట్ ఇస్తున్నారు.

ఈ ఏడాది ప్రారంభం నుంచి వీరిద్దరూ కలిసి పలు రెస్టారెంట్లకు, ఈవెంట్లకు వెళుతూ కెమెరాలకు చిక్కడంతో ఈ రూమర్స్ కి మరింత బలం చేకూరింది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియక తమన్నా ఫ్యాన్స్ మాత్రం తలలు పట్టుకుంటున్నారు. విజయ్ వర్మది హైదరాబాద్ అయినప్పటికీ ఆయన ముంబైలో ఉంటున్నాడు. ఇక మిల్కీ బ్యూటీ పంజాబీ అమ్మాయి అయినా సరే పుట్టి పెరిగింది అంతా ముంబైలోనే.

తాజాగా వీరిద్దరూ కలిసి మరోసారి కెమెరా కంటికి చిక్కారు. వీరిద్దరూ కలిసి ఓ డిన్నర్ కి వెళ్ళినట్లు తెలుస్తోంది. ముంబైలోని బాంద్రాలో డిన్నర్ పార్టీలో కెమెరా కంటపడ్డారు. దీంతో ఈ జంట డేటింగ్ గురించి మరోసారి బీటౌన్ లో చర్చ మొదలైంది. వీడియోలు, ఫోటోలు తీస్తుంటే.. హాయ్ కూడా చెప్పారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

వీరు మరోసారి ఇలా కనబడడంతో తమన్నా, విజయ్ వర్మ రిలేషన్ లో ఉన్నట్లు బహిరంగంగానే చెబుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. ఇక తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదే కాకుండా తమన్నా చేతిలో తమిళ్, హిందీ భాషలలో మరో ఐదు సినిమాలు ఉన్నాయి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు