Thamannah : పెళ్లి కొడుకు ఇతడే..

సాధారణంగా సెలబ్రిటీల వెడ్డింగ్స్ కి సంబంధించి ఇప్పటివరకు చాలా రకాల వార్తలను మనం  చూశాం. కానీ హీరోయిన్ తమన్నా పెళ్లి విషయంలో మాత్రం కాస్త వెరైటీగానే ఉందని చెప్పవచ్చు. కొద్ది రోజులుగా మిల్కీ బ్యూటీ తమన్నా మ్యారేజ్  ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తతో జరుగబోతుందనే వార్తలు వినిపిస్తున్న విషయం విధితమే.  ఇటీవలే తమన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ప్రొఫెషనల్ గా బిజీగా ఉండడం వల్లనే పర్సనల్ లైఫ్ పై పెద్దగా ఫోకస్ చేయలేకపోయాను. పెళ్లికి నేను వ్యతిరేకిని కాను. వీలు చూసుకుని, వెడ్డింగ్ చేసుకుని పిల్లలను కూడా కంటాను” అని చెప్పుకొచ్చింది. 

ఇక అప్పటి నుంచి తమన్నా పెళ్లి గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తమన్నా తన సినీ కెరీర్ ను ప్రారంభించి దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే నయనతార, కాజల్ వంటి వారు అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్నారు. తనకన్న చిన్న అయినటువంటి హన్సిక కూడా కాబోయే భర్తను పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇక అందరూ అనుకుంటున్నట్టుగానే తాను కట్టుకోబోతున్న వ్యక్తి ఎవరు అనేది మాత్రం రివీల్ చేసింది. కాస్త వెరైటీగా పరిచయం చేసేసింది. 

ఇక పెళ్లి మాట వాస్తవమేనంటూ..  తాజాగా మగాడి వేషంలో బయటికి వచ్చి ఇంట్రడ్యూసింగ్ మై బిజినెస్ మెన్ హస్బెండ్ అంటూ పెళ్లి గురించి పోస్ట్ చేసిన పేజీని ట్యాగ్ చేసింది. మ్యారేజ్ రూమర్స్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా జత చేసింది. ఇది ఇటీవల తమన్నా నటించిన ఎఫ్ 3 సినిమాలోని పాత్రకు సంబంధించిన క్లిప్పింగ్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. మొత్తానికి మిల్కి బ్యూటీ తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై  తనలో ఉన్న కోపాన్ని ఇలా క్రియేటివ్  చేసినట్టు కనిపిస్తోంది.  దీంతో తన పెళ్లి వార్తలను ఖండించినట్టయింది. ప్రస్తుతం తమన్నా చిరంజీవి భోళా శంకర్ తో పాటు ఓ తమిళం, హిందీ మూవీలలో నటిస్తోంది. 

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు