Ajith Kumar :తమిళ నటుడు అజిత్ కి పితృ వియోగం

తమిళ ప్రేక్షకులు ఎంతగానో ఆదరించే అగ్ర నటుల్లో ఒకరు అజిత్. ఈయన గురించి తెలియని వారుండరు. అజిత్ సినిమా హీరో గానే కాక ఒక మంచి వ్యక్తి గా కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. అయన చేసిన మంచి పనులు ఎంతో మందికి ఉపాధి కల్పించాయి.అయితే ఈరోజు ఉదయం అజిత్ ఇంట్లో ఒక తీరని విషాదం చోటుచేసుకుంది.

అజిత్ కుమార్ తండ్రి అయిన సుబ్రమణ్యం గారు తన 84 ఏళ్ళ వయసులో ఈరోజు అనగా 24 మార్చిన తుధి శ్వాస విడిచారు. మరో విషయం ఏంటి అంటే, అజిత్ తన భార్య శాలిని మరియు పిల్లలతో యూరప్ లో ట్రిప్ కి వెళ్లారట, ఇక వీలయినంత త్వరగా చెన్నైకి చేరుకోనేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం.చేయి పట్టుకొని నడక నేర్పిన తండ్రి చివరి క్షణంలో పక్కన లేకపోవటం అజిత్ కు జీవితం తీరని బాధగా నే మిగలబోతోంది.

ఇక ఈ పరిస్థితిలో అజిత్ మానసికంగా ఎంత కృంగిపోయి ఉంటారో అని మనం అర్దం చేస్కోగలం. ఈ నేపధ్యంలో అజిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అజిత్ తండ్రి గారి ఆత్మకి శాంతి చేకూరాలని , అజిత్ ని ధైర్యం గా ఉండమంటూ ట్వీట్లు, పోస్ట్లు చేసి అజిత్ కు ధైర్యాన్ని ఇస్తున్నారు. ఇక అజిత్ చెన్నై చేరుకున్న తరువాత తదుపరి కార్యక్రమలు జరగనున్నట్లు సమాచారం.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు