Tollywood: ఇంత పెద్ద సాయం చేసినా బయటకి చెప్పుకోని చిరు

మెగాస్టార్ చిరంజీవి దానగుణం గురించి ఆయన మంచితనం గురించి మనకు తెలియంది కాదు. సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ ఏ కష్టం వచ్చినా తన తలుపు తడితే భోళా శంకరుడిలా వరాలివ్వడమే కాదు, ఆపద్భాంధవుడిలా ఆపద సమయాల్లో ఆదుకుంటాడు కూడా. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్న ఆయన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకు ద్వారా అభిమానులకు, ప్రజలకు సేవలనందిస్తున్నారు.

ఇక సినిమా ఇండస్ట్రీ లో కూడా ఎంతో మందికి గుప్త సాయం అందించారు. లాక్ డౌన్ మధ్య కాలంలో ఎన్నో కష్టాలు పడిన పావలా శ్యామల, గుండు హనుమంతరావు, సుభాషిత, ఇంకా తమిళ్ హాస్య నటి (పాకీజా) వాసుకి కీ వీళ్ళందరికీ చిరు ఎంత సాయం చేసారో మనకి తెలిసిందే. ఇక తాజాగా బలగం ఫేమ్ మొగులయ్య గుండె ఆపరేషన్ కు రెండు లక్షల సాయం చేయడం జరిగింది.

తాజాగా మరోసారి చిరంజీవి సాయం ఏపాటిదో ఆయన మంచితనం ఏంటో ఈ మధ్యే ఆపరేషన్ జరిగి కోలుకున్న తమిళ నటుడు పొన్నాంబళం మాటల్లో వివరించాడు. ఆ మధ్య కిడ్నీ సమస్య తో హాస్పిటల్ లో చేరిన పొన్నాంబళం మెగాస్టార్ చిరంజీవిని సాయం అడగగా తక్షణ సాయం కింద చిరంజీవి అప్పుడే 4లక్షలు పంపించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే పొన్నాంబళం ఆసుపత్రి నుంచి కోలుకున్నాక ప్రముఖ తెలుగు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆయన్ని ఇంటర్వ్యూ చేసారు.

- Advertisement -

ఆ ఇంటర్వ్యూ లో పొన్నాంబళం మాట్లాడుతూ తన కిడ్నీ ఆపరేషన్ కోసం చిరంజీవి అక్షరాలా 58లక్షల రూపాయలని ఖర్చు చేసారని చెప్పాడు. అంతే కాదు తన ఆపరేషన్ కోసం రామ్ చరణ్ భార్య ఉపాసన దగ్గరుండి అన్ని చూసుకున్నారని, టాబ్లెట్ ఖర్చులతో సహా అన్ని ఫ్రీగా చేయించారని అన్నారు. అన్న చిరంజీవి సాయం లేకపోతే మీ ముందు ఇలా బతికుండేవాడిని కాదని భావోద్వేగమయ్యాడు. ఏది ఏమైనా ఇలాంటి మంచి పనుల వల్లే చిరంజీవి స్థానం చెక్కుచెదరలేదు అన్నది వాస్తవం.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు