Tapsee: ఆ రోజులు ఇప్పటికీ పీడ కలలే

తాప్సీ పన్ను.. టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా నటించిన ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది తాప్సి. ఇక 2011 లో వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో 40 చిత్రాలకు పైగా నటించిన ఈ ముద్దుగుమ్మ లేడీ ఓరియంటెడ్, కమర్షియల్, బయోపిక్ లు అంటూ కెరీర్ లో దూసుకెళ్తోంది.

వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ.. తనకంటూ ప్రత్యేక అభిమానగణాన్ని సొంతం చేసుకుంది. అతి తక్కువ సమయంలోనే అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది తాప్సి. కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ పొందిన తాప్సి కెరీర్ ప్రారంభంలో ఇన్ఫోసిస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించింది. అది నచ్చక మోడలింగ్ వైపు అడుగులు వేసింది. రెడ్ ఎఫ్ఎం, కోకో కోల వంటి ప్రకటనలలో తలుక్కుమంది.

ఆ తరువాత దర్శకుడు రాఘవేంద్రరావు దృష్టిలో పడి ఝుమ్మంది నాదం సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఇప్పుడు హిందీలో వరుస సినిమాలు చేస్తూ అక్కడే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సి తన కెరీర్ తొలినాళ్లలోని కొన్ని అనుభవాల గురించి వెల్లడించింది. “చాలామందికి నేను మిస్ ఇండియా పోటీలలో పాల్గొన్న విషయం తెలియదు. కాంటెస్ట్ సమయంలో నాది ఉంగరాల జుట్టు అంటూ అక్కడివారు హేళన చేశారు.

- Advertisement -

ఇలాంటి హెయిర్ స్టైల్ తో మిస్ ఇండియా గెలవడం అసాధ్యమని నిరుత్సాహపరిచారు. కార్పొరేట్ సంస్థలకు చెందిన కొందరు నా దగ్గరకు వచ్చి ఒకవేళ మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంటే.. తమ సంస్థల తరఫున మూడేళ్ల పాటు పనిచేయాలని, 30% ఆదాయాన్ని ఇవ్వాల్సి ఉంటుందని భయపెట్టారు. ఆ రోజులని తలుచుకుంటే నాకు ఇప్పటికీ ఓ పీడకలలా అనిపిస్తుంది” అంటూ చెప్పుకొచ్చింది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు