Oscar Nominations : తెలుగు సినిమాకు ‘ఆస్కారం’

తెలుగు సినిమా.. ఒకప్పుడు చిన్న సినీ పరిశ్రమనే కావచ్చు. కానీ, ఇప్పుడు దేశం మొత్తం తిరిగి చూసే స్థాయి వరకు వచ్చింది. బాహుబలి, బాహుబలి-2, పుష్ప ది రైజ్, ఆర్ఆర్ఆర్ లాంటి ఎన్నో సినిమాలు సినీ ప్రపంచాన్ని షేక్ చేశాయి. కొన్ని రికార్డులను కూడా తెలుగు సినిమా చరిత్రలో నిలిచాయి. కానీ ఒక లోటు మాత్రం స్పష్టం గా కనిపిస్తుంది. అదే ఆస్కార్. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఒక సినిమా కూడా ఆస్కార్ అవార్డు గెలుచుకోలేదు. కనీసం ఆస్కార్ బరిలో ఉండేందుకు నామినేట్ కూడా అవలేదు.

ఆస్కార్ బరిలో తెలుగు సినిమాలు ఉండేందుకు ఇప్పటి వరకు చాలా సార్లు పంపించారు. కానీ ప్రతిసారి టాలీవుడ్ కు నిరాశే ఎదురైంది. అయితే రాబోయే ఆస్కార్ అవార్డ్ లో టాలీవుడ్ సత్తా చాటుతుందని అందరూ అనుకుంటున్నారు. తెలుగు సినీ సెలబ్రిటీలే కాదు.. బాలీవుడ్, హాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా టాలీవుడ్ కు ఆస్కార్ వస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. దానికి కారణం ఆర్ఆర్ఆర్ అని చెప్పొచ్చు. ట్రిపుల్ ఆర్ లో ఎన్టీఆర్ నటన, రాజమౌళి దర్శకత్వం, ఎం.ఎం కీరవాణి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎంతో బాగున్నాయని ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ బరిలో ఉండటం ఖాయమని అందరూ అనుకుంటున్నారు.

కానీ, ఆస్కార్ బరిలో నిలిచేందుకు మరో తెలుగు సినిమా ముందుకు వస్తుంది. అదే శ్యామ్ సింగ రాయ్. దర్శకుడు రాహుల్‌ సాంకృత్యన్‌, నేచురల్ స్టార్ నాని, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా, గతేడాది డిసెంబర్ లో వచ్చింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. థియేటర్ లోనే కాదు, ఓటీటీలోకి వచ్చినా శ్యామ్ సింగ రాయ్ హవా తగ్గలేదు. నెట్ ఫ్లిక్స్ లో శ్యామ్ సింగ రాయ్ దాదాపు 10 వారాల పాటు ట్రెండింగ్ లో ఉంది.

- Advertisement -

ఇదిలా ఉండగా శ్యామ్ సింగ రాయ్ మొత్తం మూడు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్ కు పంపించారు. పీరియాడిక్ ఫిల్మ్, బ్యాగ్రౌండ్ స్కోర్, క్లాసికల్ కల్చరల్ డ్యాన్స్ వంటి మూడు విభాగాల్లో ఈ మూవీ నామినేషన్ కు పంపించారు. దీనిలో ఒకటైనా నామినేట్ అయితే, ఆస్కార్ అవార్డుకు మరింత చేరువ అవుతుంది. దీంతో పాటు ఆర్ఆర్ఆర్ ని కూడా ఆస్కార్ నామినేషన్ కు పంపిస్తే.. ఆస్కార్ అవార్డు తెలుగు సినిమాకు ఆస్కారం దక్కే అవకాశం ఉందని తెలుగు సినీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు