Thalapathy 67 : విజయ్ కోసం బాలీవుడ్ అగ్ర నటుడు

రీసెంట్ గా ‘‘వారిసు” సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దళపతి విజయ్ తరువాత సినిమాని ‘మాస్టర్’ డైరెక్టర్ ”లోకేష్ కానగరాజ్” దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమాను ”దళపతి67” అనే వర్కింగ్ టైటిల్ తో ఇటీవల ఓ పోస్టర్ తో అధికారిక ప్రకటన వచ్చింది. ఈ చిత్రాన్ని ఎస్ ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కాగా ఇది విజయ్, లోకేష్ కానగరాజ్ కాంబినేషన్ లో వస్తున్నా 2వ చిత్రం. కత్తి, మాస్టర్, బీస్ట్‌ చిత్రాలకు చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్‌.. ‘దలపతి 67’ కోసం నాల్గవ సారి విజయ్ తో కలసి పని చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జనవరి 2 నుంచి శరవేగంగా జరుగుతుంది.

అయితే తాజాగా మేకర్స్ ఈ మూవీ గురించి ఓ లేటెస్ట్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమా లో విజయ్ తో పాటు బాలీవుడ్ స్టార్ నటుడు ”సంజయ్ దత్” ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. దీనికి సంబందించిన ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు.

- Advertisement -

ఈ పోస్టర్ లో ” నేను మొదటి సారి ఈ స్టోరీ లైన్ విన్నప్పుడే నాకు తెలుసు, నేను ఈ సినిమా చేస్తాను” అని సంజయ్ దత్ ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ పోస్ట్ కి ”సంజయ్ దత్ ని తమిళ్ సినిమా కి ఆహ్వానించటం మాకు ఎంతో సంతోషంగా ఉంది” అని కాప్షన్ తో ఈ సినిమా నిర్మాణ సంస్థ సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పోస్ట్ చేసారు.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

https://twitter.com/7screenstudio/status/1620353961902620681

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు