Vijay : OTTలో తలపతి సినిమా

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ వారసుడు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రిలీజ్ కు ముందే వివాదంగా మారిన ఈ మూవీ తమిళంలో జనవరి 11న, తెలుగులో జనవరి 14న థియేటర్లోకి వచ్చింది. డైరెక్టర్ వంశీ పైడిపల్లి పూర్తి స్థాయిలో తెరకెక్కించిన ఈ తమిళ చిత్రానికి టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. తెలుగులో ఈ నెల 14న రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. తమిళంలో కూడా అలాంటి టాక్ వచ్చినా, కలెక్షన్ల విషయంలో దూసుకుపోతోంది.

మూవీ కేవలం ఐదు రోజుల్లోనే 150 కోట్లు రాబట్టింది. సంక్రాంతి సీజన్ లో అజిత్ లాంటి స్టార్ హీరోతో క్లాష్ ఉన్న సమయంలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో విజయ్ అదిరిపోయే కలెక్షన్స్ ని రాబడుతున్నాడు. ఇక కోలీవుడ్ లో ఓవర్సీస్ లో వారిసు మూవీ ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యే సమయానికి 180 కోట్ల బెంచ్ మార్క్ ని టచ్ చేసే ఛాన్స్ ఉంది.

కాగా, థియేటర్లో సందడి చేస్తున్న ఈ మూవీ ఓటిటి రిలీజ్ పై ఆసక్తిని సంతరించుకుంది. తాజా బజ్ ప్రకారం, వారసుడు మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా స్టార్ హీరో మూవీ థియేట్రికల్ రన్ అనంతరం 8 వారాలు అంటే రెండు నెలల తర్వాతే ఓటీటీకి వస్తుంది. ఇక విజయ్ వారసుడు మాత్రం అంతకుముందే స్ట్రీమింగ్ కానుందని సమాచారం. అంటే నాలుగు నుంచి ఆరువారాలకు వారసుడు మూవీ అమెజాన్ లో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.

- Advertisement -

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు