The Family Man-3: వచ్చేఏడాది

‘ది ఫ్యామిలీ మ్యాన్’ దేశవ్యాప్తంగా ఎంతో మందిని ఆకట్టుకున్న వెబ్ సిరీస్. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ కూడా అంతకుమించి అలరించింది. దీంతో ఈ సిరీస్ లో మూడో సీజన్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ లో ప్రధాన పాత్రధారి మనోజ్ బాజ్ పాయ్ స్పందించారు. ఈ సిరీస్ ఎప్పుడు మొదలు కాబోయేది చెప్పారు. “ది ఫ్యామిలీ మ్యాన్ 3″ ని త్వరగా మొదలుపెట్టడానికి అమెజాన్ సిద్ధంగానే ఉంది.

కానీ దర్శకుడు రాజ్, డీకేలతో పాటు నేను కూడా ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాను. ఈ ఏడాది చివరి వరకు పరిస్థితి అలాగే ఉంటుంది. వచ్చే ఏడాది మొదట్లో సీజన్ 3 ను మొదలుపెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి” అని చెప్పారు. తొలి రెండు సిరీస్ ల్లో నటించిన నటులతో పాటు ఈసారి పలువురు కొత్తవాళ్లు ఇందులో చేరనున్నట్లు సమాచారం. కాగా, ఇటీవల సమంత నటించిన యశోద సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో యశోద సినిమాకు నీరాజనం పలుకుతున్నారు ఆడియన్స్. చిత్రంలో సమంత నటన ప్రతిభపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. దీంతో కలెక్షన్స్ పరంగా భేష్ అనిపించుకుంటూ బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల బాటలోకి వచ్చేసింది యశోద. దీంతో సమంత మరో సక్సెస్ అందుతుంది. విడుదలకు ముందు వదిలిన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ నెలకొని క్రమంగా బ్రేక్ క్రాస్ చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు