Kamal Haasan: పిట్ట కొంచెం – కూత గానం

అనిరుధ్ రవిచందర్ ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
18 ఏళ్ల వయసులోనే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి, ఫస్ట్ సినిమాలోనే ‘కొలవెరి’ పాటతో సౌత్ ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపేసాడు.
అక్కడితోనే తన ప్రయాణాన్ని ఆపకుండా చాలా వేగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. విజయ్, రజనీకాంత్, అజిత్.. ఇలా చాలామంది సూపర్ స్టార్ల సినిమాలకు సంగీతం అందించాడు.

ప్రస్తుతం కమలహాసన్ “విక్రమ్” సినిమాకి సంగీతం అందిస్తున్నాడు అనిరుధ్. ఈ సినిమాకి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా జూన్ 3న రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా త‌మిళంలో “ప‌త్త‌ల ప‌త్త‌ల” అనే పాటను రిలీజ్ చేసారు.

ఈ పాట‌ను స్వ‌యంగా క‌మ‌లే రాసి, పాడారు. కమల్ ఈ పాటను మంచి ఎన‌ర్జీతో పాడటమే కాకుండా, క‌మ‌ల్ వేసిన స్టెప్పులు సూప‌ర్ అనే చెప్పాలి. క‌మ‌ల్ ఎంత మంచి డ్యాన్స‌రో కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. కానీ ఈ ఏజ్ లో అద్భుతమైన డాన్స్ లు వేయడం అంటే సాహసం అనే అనే చెప్పాలి. త్వ‌ర‌లోనే ఈ పాట‌ను తెలుగులోనూ రిలీజ్ చేయ‌నున్నారు. ఈ నెల 15న విక్ర‌మ్ ట్రైల‌ర్ లాంచ్ కానుంది.
అనిరుధ్ కి తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది.
చూడటానికి చిన్నవాడిలా కనిపించినా, తన మ్యూజిక్ తో సృష్టించిన ప్రకంపనలు మాత్రం పెద్దవే. “పిట్ట కొంచెం – కూత గానం” అనే సామెత బహుశా అనిరుధ్ లాంటివాళ్లకే వర్తిస్తుందేమో.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు