The Warriorr : మొత్తం తమిళ సరుకులానే ఉందే..!

రామ్ – లింగుస్వామి కాంబినేషన్లో తెరకెక్కుతున్న బైలింగ్యువల్ మూవీ ‘వారియర్’. ‘శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్’ పతాకం పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్. రామ్ ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సత్య పాత్రలో కనిపించబోతున్నారు. ఆది పినిశెట్టి రామ్ ను ఢీ కొట్టే విలన్ గా నటిస్తున్నాడు. జూలై 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ పుట్టినరోజు సందర్భంగా కొద్దిసేపటి క్రితం టీజర్ ను విడుదల చేశారు.

“ ఈ పోలీసుల టార్చర్ భరించలేకపోతున్నామప్ప. మొన్నటి వరకు సైలెంట్ గా ఉండేటోళ్లు. ఇప్పుడు వైలెంట్ గా లోపట వేసేస్తున్నారు. ఈ మధ్య సత్య అనేటోడు ఒక్కడు వచ్చినాడు… “ అనే డైలాగ్ తో స్టార్ట్ అయిన టీజర్లో మాస్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. ప్రతీ రౌడీని చితక్కొడుతూ రామ్ తన ఎనర్జీని చూపించాడు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.

“పాన్ ఇండియా సినిమా చూసుంటారు.. పాన్ ఇండియా రౌడీస్ ను చూసారా?, మై డియర్ గాంగ్స్టర్స్.. వీలైతే మారిపోండి లేకపోతే పారిపోండి.. ఇదే నేను మీకు ఇస్తున్న ఫైనల్ వార్నింగ్, ధైర్యం అంటే వెతుక్కుంటూ వచ్చిన వాడిని కొట్టడం కాదు.. వెతుక్కుంటూ వెళ్ళి కొట్టడం” వంటి డైలాగులు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

- Advertisement -

హీరోయిన్ కృతి శెట్టి తో రామ్ రొమాంటిక్ ట్రాక్ ఆకట్టుకునే విధంగా ఉంది. కృతి శెట్టి లుక్స్ కూడా క్యూట్ గా ఉన్నాయి. విలన్ గా ఆది చాలా రఫ్ అండ్ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు.

కానీ, ఈ టీజర్ చూస్తుంటే. ఇది బై లింగ్వల్ సినిమానా..? లేదా డబ్బింగ్ సినిమానా..? అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే, తమిళ సినిమా ఫ్లేవర్ లా అనిపిస్తుంది. బహుశా దర్శకుడి వలన కావచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు