Anirudh Ravichandran: అప్పుడు కుదర్లేదు – ఇప్పుడు తప్పట్లేదు

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ తరం స్టార్స్ హీరోస్ అందరితో వర్క్ చేసిన డైరెక్టర్ ఈయన. తెలుగు లో ఉండే స్టార్ హీరోస్ అందరితో ఈయనకు మంచి సన్నిహిత్యం ఉంది. ఈయన కెరియర్ లో నితిన్, తరుణ్ మినహా మిగతా సినిమాలన్నీ స్టార్ హీరోస్ తోనే వర్క్ చేసారు.

ఈయన తీసుకునే కొన్ని కొన్ని నిర్ణయాలు ఆశ్చర్యంగా ఉంటాయి.
పవన్ కళ్యాణ్ వర్సెస్ మహేష్ బాబు అని ఫ్యాన్స్ ఎవరికీ వారు అనుకునే తరుణంలో పవన్ కళ్యాణ్ జల్సా సినిమా కోసం మహేష్ బాబు తో వాయిస్ ఓవర్ ఇప్పించాడు త్రివిక్రమ్. కొంతకాలం తరువాత ఎన్టీఆర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అనుకునే తరుణంలో “అరవింద సమెత వీర రాఘవ” సినిమా ముహూర్తానికి పవన్ కళ్యాణ్ ను తీసుకొచ్చాడు త్రివిక్రమ్. అదే ముహూర్తంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కూడా అక్కడ ఉంటారు.

వాస్తవానికి “అరవింద సమేత వీర రాఘవ” సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ చెయ్యాలి , కానీ దానికంటే ముందు త్రివిక్రమ్ చేసిన “అజ్ఞాతవాసి” సినిమా భారీ డిజాస్టర్ అయింది. దానికి అనిరుధ్ తనవైపు పూర్తి న్యాయం చేసినా.. అరవింద సమేత సినిమాకి తనని తొలగించి థమన్ కి అవకాశం ఇచ్చాడు త్రివిక్రమ్. అప్పుడు అనిరుధ్ కి ఎన్టీఆర్ తో సినిమా చెయ్యడం కుదరకపోయినా, ఇప్పుడు కొరటాల సినిమాకి అనిరుధ్ ను తీసుకోవడం తప్పలేదు.
అనిరుధ్ మ్యూజిక్ స్ట్రెంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు