Bimbisara-2 : ఇంకా టైం ఉంది

నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవల బింబిసార చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సూపర్ విక్టరీ సాధించి, కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. రూ. 40 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం, దాదాపు 70 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. అలాగే ఇటీవల ఓటీటీల్లోకి వచ్చి అక్కడ కూడా రికార్డులను నమోదు చేస్తుంది. అయితే బింబిసార చూసిన వాళ్లుకు పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది. అది ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటీ ఉంటుంది.

దీంతో బింబిసార-2 ఎప్పుడు వస్తుందని నందమూరి అభిమానులు డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ ను ప్రశ్నిస్తున్నారు. తాజాగా డైరెక్టర్ దీనిపై స్పందించారు. మొదటి భాగం అనుకున్న దాని కంటే భారీ హిట్ అయిన నేపథ్యంలో రెండో భాగం మరింత బాగా తీయాలని అన్నారు. అందువల్ల తనపై ఒత్తిడి కూడా ఉందని చెప్పుకొచ్చారు. అయితే బింబిసార పార్ట్ 2 కు ఇంకా చాలా సమయం ఉందని చెప్పాడు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి అయిన తర్వాతే బింబిసార పార్ట్ 2 ను స్టార్ట్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు.

కాగా నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో అమిగోస్ అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ లో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. అలాగే కెవి గుహాన్ దర్శకత్వంలో డెవిల్ అనే మరో చిత్రం కూడా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు