Pushpa The Rule : క్రిస్మస్ కాకుండా డిసెంబర్ 6నే రావడానికి ఇంత ప్లాన్ ఉందా?

Pushpa The Rule : టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా వైడ్ గా మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న క్రేజీ పాన్ ఇండియా సినిమా “పుష్ప ది రూల్”. ఈ సినిమా పై ఇండియా వైడ్ గా ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద మినిమం వెయ్యి కోట్లు అన్న మాట ఈ సినిమాపై వస్తుంది. అంతటి క్రేజ్ రావడానికి పుష్ప ది రైజ్ సినిమా సాధించిన ఘన విజయమే కారణమని చెప్పొచ్చు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబినేషన్ లో మూడేళ్ళ కింద వచ్చిన పుష్ప ఓ రేంజ్ భీభత్సం సృష్టించగా, ఇప్పుడు సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 పై పదింతల అంచనాలు పెంచేసింది. ఇక పుష్ప2 ది రూల్ సినిమా ఆగస్టు 15న రిలీజ్ అవ్వాల్సింది. కానీ షూటింగ్ డిలే వలన ఇంకా 45 రోజులకు పైగా వర్కింగ్ డేస్ అవసరం ఉండటంతో ఇక అనుకున్న డేట్ కి రావడం కష్టం అవ్వడంతో, రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకోగా ఏ డేట్ కి సినిమా వస్తుంది అన్నది ఆసక్తిగా మారగా, ముందు పండగ వీకెండ్స్ ఏమైనా ఛాన్స్ దొరుకుందా అని ట్రై చేశారు. కానీ కూడా సెకెండ్ ఆఫ్ డేట్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. దాంతో ఏకంగా డిసెంబర్ లో క్రిస్టమస్ డేట్ కి సినిమా రావొచ్చు అనుకున్నారు నెటిజన్లు. కానీ ఊహించని విధంగా మేకర్స్ డిసెంబర్ లో క్రిస్టమస్ కి కాకుండా ఎలాంటి హాలిడేస్ లేని డిసెంబర్ 6 వీకెండ్ లో సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.

This is the reason why Pushpa The Rule is releasing on December 6

మేకర్స్ మాస్టర్ ప్లాన్…

అయితే పుష్ప ది రూల్ (Pushpa The Rule) సినిమాని డిసెంబర్ 6కి వాయిదా వేస్తారని ఊహించలేదు ఎవ్వరూ. ఇక దాంతో క్రిస్టమస్ ని వదిలేసి ఇలా నార్మల్ డేట్ కి పుష్ప2 ఎందుకు వస్తుంది, అన్నది ఆసక్తిగా మారగా దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయని తెలుస్తుంది. క్రిస్టమస్ వీకెండ్ అయితే ఇండియాలో కలెక్షన్స్ వస్తాయి, కానీ 2 వారాల తర్వాత సంక్రాంతి మూవీస్ హడావుడి మొదలు అయ్యి అనుకున్న రేంజ్ లో లాంగ్ రన్ అయితే సొంతం అవ్వదు. పైగా అదే టైంలో అనగా క్రిస్మస్ టైం లో హాలీవుడ్ లో క్రేజీ మూవీస్ ఆ టైంలో రిలీజ్ అవుతూ ఉండటంతో, ఓవర్సీస్ కలెక్షన్స్ పైన గట్టి ఇంపాక్ట్ పడే అవకాశం కూడా ఉంది. అదే డిసెంబర్ 6 అయితే నార్మల్ వీకెండ్ అయినా కూడా, లాస్ట్ ఇయర్ డిసెంబర్ మొదటి వారంలోనే వచ్చిన యానిమల్ మూవీలా టాక్ బాగుంటే లాంగ్ రన్ నెల మొత్తం సొంతం అయ్యే అవకాశం ఉంటుంది. అన్నిటికి మించి తెలుగు, హిందీ మేజర్ మార్కెట్స్ కాబట్టి నెల రోజుల లాంగ్ రన్ సొంతం అయితే వసూళ్లు భారీగా ఉండే అవకాశం ఉంటుంది.

- Advertisement -

వెయ్యి కోట్ల టార్గెట్ కి ఈ మాత్రం ప్లానింగ్ ఉండాలి…

ఇక పుష్ప ది రూల్ డిసెంబర్ 6 కి రిలీజ్ అయితే సంక్రాంతి వరకూ పెద్ద సినిమాలు ఉండవు. అంటే దాదాపు నెలరోజులకి పైగా లాంగ్ రన్ ఉంటుంది. క్రిస్మస్ టైం లో ఓ రెండు మీడియం రేంజ్ సినిమాలు మాత్రమే ఉన్నాయి. వాటి వల్ల తెలుగు రాష్ట్రాల్లో తప్ప వేరే ఎక్కడా పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. కనుక సంక్రాంతి సినిమాల టైంకి రన్ కూడా సాఫీగా ఎండ్ అవుతుందని భావించి మేకర్స్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక నార్మల్ వీకెండ్ అవ్వడంతో ఓపెనింగ్స్ పై కొంచం ఇంపాక్ట్ ఉండొచ్చు, కానీ టాక్ బాగుంటే మట్టుకు క్రిస్టమస్ కి ఇక్కడ కొత్త సినిమాలు రిలీజ్ అయినా కూడా పుష్ప2 హంగామా అయితే కొనసాగే అవకాశం ఎంతైనా ఉంటుంది. మరి ఆ టైంకి పుష్ప2 సినిమా ఎలాంటి రచ్చ చేస్తుందో చూడాలి. ఇకపోతే పుష్ప2 నుండి మూడో సాంగ్ జులై లో రిలీజ్ చేయనున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు