Rashmika Mandanna : టాటూ సీక్రెట్ ఇదే..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరు గత కొన్ని రోజుల నుంచి ఎదో ఒక వార్తతో ఎక్కువగా వినిపిస్తుంది. అలాగే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అటు బాలీవుడ్, ఇటు సౌత్ ఇండస్ట్రీలో కనిపిస్తోంది. పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయినా ఈ ముద్దుగుమ్మ వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతుంది. తాజాగా కోలీవుడ్ లో వరిసు సినిమాతో మంచి హిట్ అందుకున్న రష్మిక మరోపక్క బాలీవుడ్ లో కూడా పాగా వేయాలని చూస్తుంది.

ఇప్పటికే అమితాబచ్చన్ గుడ్ బై తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా.. అది పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఇప్పుడు ఆశలన్నీ మిషన్ మజ్ను పైనే పెట్టుకుంది. సిద్ధార్ద్ మల్హోత్రా హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం వచ్చేనెల ఓటీటిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వరుస ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ నేపథ్యంలో తన చేతిపై ఉన్న టాటూ గురించి చెప్పుకొచ్చింది రష్మిక.

మొదట్లో తనకి టాటూల పై ఆసక్తి లేదని, కానీ తను కాలేజీలో ఉన్న సమయంలో క్లాస్మేట్ ఒకరు అమ్మాయిలపై కామెంట్ చేయడంతో టాటూ వేయించుకున్నానని చెప్పుకొచ్చింది. “మొదట నాకు అసలు టాటూ వేయించుకోవాలని ఆలోచనే లేదు. మా కాలేజీలో ఉన్నప్పుడు మా క్లాస్ అబ్బాయి.. “ఆడపిల్లలు బాధను ఓర్చుకోలేరు.. వాళ్లకు సూదులన్నా భయమే” అన్నాడు.

- Advertisement -

‘అది తప్పు అని నిరూపించాలనుకున్నా అందుకే టాటూ వేయించుకోవాలని నిర్ణయించుకున్నా. కానీ ఏం వేయించుకోవాలో తెలియదు. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎవరు మరొకరిని భర్తీ చేయలేరని నేను అనుకుంటాను. ప్రతి ఒక్కరూ ముఖ్యమైన వారే. అందుకే అదే అర్థం వచ్చే విధంగా ‘ఇర్రిప్లేసబుల్’ అనే పదాన్ని వేయించుకున్నాను’ అంటూ తన టాటూ వెనక ఉన్న రహస్యాన్ని చెప్పుకొచ్చింది రష్మిక.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు