Tollywood : మంచి అవకాశం..

ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నాలుగు సినిమాలు పోటీ పడ్డ విషయం తెలిసిందే. ఇందులో సర్దార్, ప్రిన్స్, ఓరి దేవుడా సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రేక్షకులు ఈ సినిమాలకు ప్రియారిటీ ఇస్తున్నారు. నిజానికి ఈ మూడు సినిమాలు కూడా చిన్న సినిమాలే. ఈ చిన్న సినిమాలు వచ్చిన సమయంలో థియేటర్స్ లో ఏ ఒక్క పెద్ద సినిమా కూడా లేదు. కొన్ని రోజుల క్రితం గాడ్ ఫాదర్ ఉండేది. కానీ, కన్నడ మూవీ కాంతార వచ్చిన తర్వాత గాడ్ ఫాదర్ హావా పడిపోయింది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ వారం రిలీజ్ అయిన నాలుగు సినిమాలతో పాటు కాంతార నడుస్తున్నాయి. ఇందులో జిన్నా ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఈ వీకెండ్, దీవాళి పోటీ ప్రిన్స్, సర్దార్, ఓరి దేవుడా తోపాటు కాంతార మధ్య ఉండనుంది. ఇందులో కాంతార సినిమాను ఇప్పటికే చాలా మంది చూశారు. ఇప్పుడు ప్రేక్షకుడి మొదటి ఆప్షన్ ప్రిన్స్, సర్దార్, ఓరి దేవుడా లలో ఎదో ఒకటి ఉంటుంది. అలాగే ఈ సమయంలో పెద్ద సినిమాలు కూడా విడుదల కావడం లేదు. దీంతో ఈ వీకెండ్ కలెక్షన్లను ఈ మూడు సినిమాలు పంచుకుంటాయి.

ఈ వీకెండ్ తో పాటు దీవాళి పండుగ ఈ మూడు సినిమాలకు కలిసోస్తాయని చెప్పొచ్చు. అలాగే నవంబర్ మొదటి వారం కూడా వచ్చే సినిమాలు కూడా పెద్దగా పేరున్న సినిమాలు కావు. నవంబర్ 11న ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, యశోద లాంటి సినిమాలు వస్తున్నాయి. అప్పటి వరకు ఈ మూడు సినిమాలదే హావా ఉంటుంది. వీటితో పాటు జిన్నా కూడా కొంత వరకు పుంజుకునే ఛాన్స్ లు ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు