Samantha : వీకెండ్ కలిసొస్తుంది

భారీ హైప్ తో సమంత నటించిన యశోద సినిమా శుక్రవారం ప్రేక్షకులు ముందుకు వచ్చింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ ను కూడా తెచ్చుకుంది. సినీ విశ్లేషకుల నుంచి కూడా మంచి రివ్యూలు వచ్చాయి. కొన్ని మైనస్ లు మినహా సినిమా మొత్తం బాగానే ఉంది. ఆ మైనస్ లు కూడా సమంత ఫర్మామెన్స్ తో కొట్టుకుపోయాయని చెప్పొచ్చు. అలాగే మొదటి రోజు కూడా మంచి కలెక్షన్లు వచ్చాయి. నైజాం ఏరియాలో తొలి రోజు 1.4 కోట్ల గ్రాస్ వసూళ్లు అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా 6.32 కోట్ల గ్రాస్ వచ్చింది.

ఓవర్సీస్ లో కూడా యశోదకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఇది మేకర్స్ కు శుభవార్తే అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాకు ప్రతి రోజు ఇలాంటి కలెక్షన్లు వస్తేనే సినిమా బ్రేక్ ఈవెన్ అందుతుంది. అయితే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితుల్లో అది కష్టమని కొంత మంది అభిప్రాయపడతున్నారు. కానీ ఇక్కడ సామ్ కు కలిసొచ్చే అంశం ఏంటంటే..? ఈ వీకెండ్.

ఈ వీకెండ్ లో సమంత నటిస్తున్న యశోద మినహా ఏ ఒక్క సినిమా కూడా థియేటర్ లలో లేదు. బ్లాక్ పాంథర్ : వకాండ ఫరెవర్ అనే హాలీవుడ్ మూవీ ఉంది. కానీ ప్రేక్షకులకు ఫస్ట్ ప్రియారిటీ యశోద నే ఉంటుంది. ఇది యశోద కలెక్షన్లకు తప్పకుండా బూస్ట్ ఇవ్వొచ్చు. అలాగే ఈ నెల 25 వరకు కూడా తెలుగులో పెద్ద సినిమాలేవీ లేవు. అంటే దాదాపు రెండు వారాల పాటు సమంత యశోదకు పోటీ లేదు. ఇది సమంత మూవీకి కలిసొచ్చే అంశం. ఇలాంటి ప్రతికూలతల మధ్య యశోద సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు