Bimbisara2 : మూడేళ్ల తర్వాతే.. ఇదే ఫిక్స్

అది థియేటర్లు ఆడియన్స్ రాని కష్టకాలం. సినిమాలు చేయాలంటే దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్న సమయం. కోట్లు పెట్టి సినిమా చేస్తే ప్రేక్షకులు థియేటర్ కు వస్తారా ? అనే ప్రశ్నలు అందరీలో వస్తున్న రోజులు. ఈ అనుమానాలను పటాపంచలు చేసిన సినిమాలు సీతారామం, బింబిసార. ఈ ఏడాది ఆగస్ట్ 5న వచ్చిన ఈ రెండు సినిమాలు డిఫరెంట్ జానర్ లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. తొలిసారి దర్శకత్వం చేసిన మల్లిడి వశిష్ట్ విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాడు.

కొత్త డైరెక్టర్ పిరియాడికల్ నేపథ్యంలో సినిమాను ఇలా తెరకెక్కించడం అంత సులువు కాదు. కానీ మల్లిడి వశిష్ట్ అది చేసి చూపించాడు. కాగా బింబిసార చూసిన తర్వాత దీనికి సీక్వెల్ ఎప్పుడు వస్తుందని ప్రతి ఒక్కరి నుంచి ఒక ప్రశ్న వస్తోంది. నిజానికి బింబిసారకు సీక్వెల్ ఉంటుందని హీరో కళ్యాణ్ రామ్, డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ అధికారికంగా ప్రకటించారు. కాగా కొన్ని రోజుల నుంచి బింబిసార 2 గురించి కొన్ని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

బింబిసార 2 సినిమా త్వరలోనే సెట్స్ పైకి రాబోతుందని, మొదటి షెడ్యూల్ ను కూడా ప్రారంభించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై Filmify కు డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ క్లారిటీ ఇచ్చాడు. బింబిసార 2 రావడానికి ఇంకా సమయం ఉందని స్పష్టం చేశాడు. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం అమిగోస్, డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే సినిమాలు చేస్తున్నాడని, అవి పూర్తి అయిన వెంటనే బింబిసార2 సెట్స్ పైకి వెళ్తుందని చెప్పుకొచ్చాడు. దీనికి దాదాపు మూడేళ్ల సమయం పట్టొచ్చని చెప్పాడు.

- Advertisement -

దర్శకుడు మల్లిడి వశిష్ట్ ఇచ్చిన క్లారిటీతో బింబిసార2పై వస్తున్న రూమర్స్ కు బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు