Tollywood: వరుస సినిమాలతో బిజీ అవుతున్న టైర్2 హీరోలు

టాలీవుడ్ లో టాప్ హీరోల సినిమాలు ఈ సంవత్సరం రెండే వస్తున్నాయి. ప్రభాస్ ఆదిపురుష్, పవన్ కళ్యాణ్ “బ్రో” తప్ప మిగతా నలుగురు స్టార్స్ వచ్చే ఏడాదే సినిమాలతో ప్రేక్షకుల ముందుకురానున్నారు. ఇక సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ 2023 లో చెరో సినిమాలతో రానుండగా నాగార్జున ఇంకా తన సినిమాను స్టార్ట్ కూడా చేయలేదు.

ఇక తెలుగు ఇండస్ట్రీ లో టైర్ 2 హీరోలు మాత్రం చాలా బిజీగా ఉన్నారు. వాళ్లలో ముందుగా నాని ఈ ఏడాది దసరా సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టగా తదుపరి మృణాల్ ఠాకూర్ తో తన 30వ సినిమాతో బిజీ గా ఉన్నాడు. ఇక వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో వస్తున్న “గాండీవదారి అర్జున” చిత్రంలో నటిస్తుండగా, నిఖిల్ అందరికంటే ఎక్కువగా మూడు సినిమాలు ఒకేసారి షూట్ చేస్తున్నాడు. ముందుగా “స్పై” అనే సినిమా షూటింగ్లో పాల్గొంటున్న నిఖిల్ తరువాత రామ్ చరణ్ నిర్మిస్తున్న “ది ఇండియా హౌస్” చిత్రంలోను నటిస్తాడు. దీని తర్వాత “స్వయంభూ” అనే పీరియాడిక్ డ్రామాలో కూడా నిఖిల్ నటిస్తున్నాడు.

ఇక విజయ్ దేవరకొండ సమంతతో కలిసి “ఖుషి” సినిమా చేస్తుండగా ఇంకా వేరే సినిమా కమిట్ అవలేదు. నాగచైతన్య, సాయి ధరమ్ తేజ్ ఈ సంవత్సరమే తమ సినిమాలతో రాగా, తర్వాత చేయబోయే సినిమాలపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక సత్యదేవ్, శ్రీ విష్ణు తమదైన శైలీలో డిఫరెంట్ గా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. మరి రానున్న కాలంలో టయర్ 2హీరోల్లో ఎంతమంది ఈ ఏడాది సినిమాలతో ఆడియన్స్ ని పలకరిస్తారో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు