Bedurulanka : యుగాంతం మూవీలో టిల్లు గాని పోరి

యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం బెదురులంక 2012. ఈ చిత్రంలో డీజే టిల్లు ఫెమ్ నేహా శెట్టి కథానాయికగా నటిస్తోంది. డిజే టిల్లు తర్వాత రాధిక నటిస్తున్న చిత్రమిది. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని లౌక్య ఎంటర్టైన్మెంట్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 3 గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. ఉత్తమ తెలుగు చిత్రం గా జాతీయ పురస్కారం అందుకున్న కలర్ ఫోటో నిర్మించిన బెన్నీ ముప్పనేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి సి యువరాజ్ చిత్ర సమర్పకులు.

ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సరికొత్త నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.

ఒక పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో తీసిన చిత్రమిది. అయితే నేడు నేహా శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. నేహా శెట్టి ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పాత్రతో ఆమె ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు