Tollywood : 200 కోట్ల హీరోలు

సౌత్ ఇండస్ట్రీలనే కాకుండా దేశమంతటా మన తెలుగు చలన చిత్ర పరిశ్రమకు మంచి పేరు ఉంది. టాలీవుడ్ లో వచ్చిన సినిమాలో హిందీలో డబ్ అయి.. అక్కడ కూడా హిట్ గా నిలిచాయి. పాన్ ఇండియా సినిమాలు చేయక ముందు కూడా మన తెలుగు హీరోలు నార్త్ లో బాగానే క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే తెలుగు ఇండస్ట్రీనీ ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసిన సినిమాలో బాహుబలి మొదటిది అని చెప్పొచ్చు.

డార్లింగ్ ప్రభాస్, రానా దగ్గుబాటి, హీరోలుగా నటించిన బాహుబలి – ది బిగినింగ్ సంచలన విజయం సాధించింది. ఈ చిత్రం రూ.605 కోట్లు కలెక్ట్ చేసిన తొలి టాలీవుడ్ చిత్రం అని చెప్పవొచ్చు. బాహుబలి-1 కు సీక్వెల్ గా వచ్చిన బాహుబలి-2 ప్రపంచ వ్యాప్తంగా రూ.1810 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ రెండు సినిమాలు రాజమౌళి దర్శకత్వం వహించినవే.

బాహుబలి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమా “సాహో”. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి 435 కోట్లు వచ్చాయి. విశేషం ఏంటి అంటే 200 కోట్లు దాటిన తెలుగు చిత్రాల్లో మూడు ప్రభాస్ నటించిన సినిమాలు ఉన్నాయి.

- Advertisement -

రామ్ చరణ్ కి మంచి హిట్ ఇచ్చిన సినిమా రంగస్థలం. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూ. 216 కోట్లు సంపాదించుకుంది. మళ్లీ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం రష్యా తో పాటు వివిధ దేశంలో రిలీజ్ అయి రి రూ. 360 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.

దీనికి ముందే అల్లుఅర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం అలా వైకుంఠపురంలో. ఈ సినిమాకి కూడా రూ. 257 కోట్లు సంపాదించింది. అలాగే మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన మూవీ సరిలేరు నీకవ్వరు. మహేష్ కెరీర్ లోనే వన్ అఫ్ ది బెస్ట్ ఫిలిం అంటూ పేరు తెచ్చుకున్న ఈ సినిమా రూ. 224 కోట్లు వసూలు చేసింది.

వీటితో పాటు 200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన చిత్రం RRR. ఈ చిత్రం 1152 కోట్ల వసూళ్లు చేసింది. ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ పరంగానే కాకుండా వరుసగా అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే. అలాగే ఆస్కార్ రేసులో కూడా ఉంది.

ఇదిలా ఉండగా తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా 200 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. చిరంజీవి కమ్ బ్యాక్ తర్వాత చిరంజీవి యంగ్ హీరోలకి గట్టి పోటీని ఇస్తున్నారు. 10 సంవసరాల గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన, ఈ మెగ స్టార్ చిరంజీవి సినిమాలు వరుసగా 200 కోట్ల మార్క్ ను క్రాస్ చేస్తున్నాయి. ఇప్పటికే సైరా నరసింహారెడ్డి రూ. 236 కోట్లకు పైగా వసూలు చేసింది. తాజాగా ప్రస్తుతం థియేటర్లలో నడుస్తున్న వాల్తేరు వీరయ్య మూవీ రూ. 200 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది. లాంగ్ రన్లో ఎంత వసూలు చేస్తుందో చూడాల్సి ఉంది.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు