Faria Abdullah: చిట్టి యమ హాట్ గురూ.. దీంతోనైనా ఛాన్స్ వస్తుందా ?

హైట్ ఎక్కువ ఉన్న హీరోయిన్స్ ఇండస్ట్రీలో మంచి స్థాయికి ఎదుగుతారు. అది ఇప్పటికే టాలీవుడ్ లో అనుష్కతో, బాలీవుడ్ లో దీపికా పదుకొనె తో రుజువు అయింది. బాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొనె ప్రస్తుతం ఎంతటి స్టార్ రేంజ్ ను అనుభవిస్తుందో అందరికీ తెలిసిందే. ఇక టాలీవుడ్ లో ప్రస్తుతం పొడుగు కాళ్ల సుందరి అంటే, ఫరియా అబ్దుల్లా అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 6 ఫీట్ ఉన్న ఫరియా అబ్దుల్లా… జాతి రత్నాలు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది.

ఈ మూవీలో “చిట్టి నా బుల్ బుల్ చిట్టి…” అనే సాంగ్ తో కుర్రకారు అందరికీ ఫేవరేట్ హీరోయిన్ అయిపోయింది. జాతి రత్నాలులో చిట్టి అందం, అభినయం, కామెడీ టైమింగ్ అన్ని బాగుండటంతో, వరుసగా అవకాశాలు వస్తాయని అనుకున్నారు. కానీ, ఈ పొడుగు కాళ్ల సుందరికి అనుకున్నంతగా ఛాన్స్ లు అయితే రాలేదు. ఇటీవల రావణాసురలో ఓ ఛాన్స్ వచ్చినా, అది డిజాస్టర్ అయిపోయింది. మధ్యలో లైక్, షేర్ & సబ్ స్క్రైబ్ అనే సినిమా చేసింది కూడా సరైనా ఫలితాన్ని ఇవ్వలేక పోయింది.

దీంతో ఛాన్స్ లను అందిపుచ్చుకోవడానికి అవసరమైన పనులు చేస్తోంది ఈ హాట్ బ్యూటీ. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఒక ఫోటోషూట్ చేసింది. బెడ్ పై పడుకుని తన అందాన్ని ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. నడుము అందాలు బయట పడేలా ఈ ఫోటోలున్నాయి. ముఖ్యంగా నడుముపై ఉన్న టాటూ కళ్లు తిప్పుకోకుండా చేస్తుంది. రెండు చక్రాల్లా ఉన్న టాటూ నెటిజన్లకు మతిపోగొడుతుందనే చెప్పాలి.

- Advertisement -

నిజానికి ఈ పొడుగు కాళ్ల సుందరి ఇప్పటి వరకు చాలా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కానీ, ఈ ఫోటోలు మాత్రం హాట్ గా కనిపిస్తున్నాయి. దీంతో నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఛాన్స్ ల కోసం ఈ మాత్రం అందాన్ని బయట పెట్టాలని కొంత మంది కామెంట్స్ చేస్తుండగా, మరి కొందరు… స్టార్ హీరోయిన్లకు సైతం తీసిపోని అందం ఫరియా సొంతమని, ఎప్పటికైనా ఫరియా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు