Tollywood:మరో విషాదం

ఇటీవల టాలీవుడ్ లో ఎన్నో తీరని విషాదాలు చోటు చేసుకున్నాయి. కృష్ణ, ఎస్.పి బాల సుబ్రహ్మణ్యం, కృష్ణం రాజు, వంటి స్టార్స్ ను మనం కోల్పోయాం.

సీనియర్ నటి జమున కన్నుమూశారు.హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆమె తుది శ్వాస విడిచారు. జమునకు 86 ఏళ్లు.జమున 1936 ఆగస్టు 30న హంపిలో జన్మించింది. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి మృతి చెందింది. ఉదయం పదకొండు గంటలకు ఆమె మృతదేహాన్ని ఫిల్మ్ ఛాంబర్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

జమున వందల సినిమాల్లో తనదైన ముద్ర వేసింది. మిస్సమ్మ సినిమాతో జమునకు మంచి గుర్తింపు వచ్చింది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో నటించి అలరించారు. జమున 1953లో పుట్టిల్లు సినిమాతో తెరంగేట్రం చేశారు.

- Advertisement -

జమున మృతి పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీ సంతాపం వ్యక్తం చేసింది. ఆమె మృతికి పలువురు సీనియర్ నటీనటులు సంతాపం తెలిపారు. నటిగా ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు.

రాజకీయాల్లోనూ జమున తన హస్తం ఉంది. ఆమె 1980లో కాంగ్రెస్‌లో చేరి 1989లో రాజమండ్రి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. జమున తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్‌ను స్థాపించి గత 25 సంవత్సరాలుగా దాని ద్వారా సామాజిక సేవ చేశారు.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment New

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు