Tollywood: వెండితెర వెలవెల..

వారానికి నాలుగు.. ఐదు సినిమాలు. థియేటర్స్ నిండా ప్రేక్షకులు. వారి ఈలలు.. గోలలు.. రివ్యూల సందడి. సినిమా ఇండస్ట్రీ అంటే.. ఇవే కనిపిస్తాయి.. వినిపిస్తాయి.. నిజానికి ఇవే ఉంటాయి. కానీ గత కొన్ని రోజులగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఇవి కనిపించడం లేదు. సంక్రాంతి కానుకగా విడుదలైన వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాల తర్వాత ఇప్పటి వరకు అంత విజయం సాధించిన సినిమాలు రాలేవు. ప్రతి వారం తెరపైకి కొత్త సినిమాలు ఎన్నో వస్తున్నా.. ప్రేక్షకులు అసంతృప్తిగానే ఉంటున్నారు.

మధ్యలో “రైటర్ పద్మభూషణ్”, “సార్” వంటి సినిమాలు కొంత ఉపశమనాన్ని అందించినా… టాలీవుడ్ మార్క్ సినిమాల లిస్ట్ లో చేరలేకపోయాయి. ఇందులో “సార్” మూవీ ఒకటి మంచి హిట్ మూవీ అని చెప్పొచ్చు. అలాగే ఇటీవల వచ్చిన “బలగం” మూవీ కూడా కొంత వరకు మెప్పించింది. కానీ, హాంట్, మైఖల్, అమిగోస్, వినరో భాగ్యము విష్ణు కథ తాజాగా సీఎస్ఐ సనాతన్ వంటి సినిమాలు ఇలా వచ్చి అలా.. వెళ్లిపోయాయి.

సరైనా కన్సెప్ట్ లేకుండా.. వచ్చిన ఈ సినిమాలు తలనొప్పిలానే ఉన్నాయి గానీ ప్రేక్షకుడికి రిలీఫ్ ఇవ్వలేవని చెప్పొచ్చు. బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కళ్యాణ్ రామ్ నుంచి వచ్చిన అమిగోస్ పై సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉండేవి. వినూత్నమైన కాన్సెప్ట్.. బాలయ్య సినిమాలోని ఎన్నో రాత్రులు వస్తాయి గానీ.. వంటి సాంగ్ సినిమాపై హైప్ ను నెక్ట్స్ లెవెల్ కి తీసుకెళ్లాయి. కానీ, ఈ మూవీ కూడా ప్రేక్షకులను నిరాశపరిచాయి.

- Advertisement -

దీంతో వెండితెర సరైన సినిమాలు లేక వెల వెల పోతుంది. ఇప్పుడు ఆశలన్నీ యంగ్ హీరో విశ్వక్ సేన్ దాస్ క ధమ్కీ.. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న రా అండ్ రస్టిక్ మూవీ దసరాపైనే అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలతో వెండితెరకు పూర్వ వైభవం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు