Thalapathy 67 : త్రిష.. ఓ ఓల్డ్ వైన్

1999లో జోడి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రిష కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆ తరువాత వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, పౌర్ణమి, కింగ్, ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే అంటూ ఎన్నో క్లాస్సి లవ్ స్టోరీస్ తో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుంది.

సాధారణంగా హీరోలకు 60 ఏళ్ళు వచ్చినా యంగ్ హీరోయిన్స్ తో లవ్ స్టోరీ లు, డ్యూయెట్లు చేస్తారు. కానీ హీరోయిన్ల పరిస్థితి ఆలా ఉండదు. మహా అయితే 5 నుంచి 10 ఏళ్ళు సినిమాలు చేస్తారు. ఆ తరువాత వయసు వాళ్ళ వచ్చే మార్పుల వాల్ల అందం ఫేడ్ అవుట్ అవుతుంది. దీనితో హీరోయిన్ లకి డిమాండ్ కూడా తగ్గిపోతుంది.

కానీ, వీటన్నిటిని అధిగమించి, ఇండస్ట్రీ లో 2 దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్ స్థాయిలో బ్యాక్ టు బ్యాక్ యంగ్ రోల్స్ చేస్తూ వస్తోంది త్రిష కృష్ణన్. ఈమె వయసు పెరిగే కొద్దీ అందం పెరుగుతోని తప్ప తగ్గట్లేదు. అందరి స్టార్ హీరోల తో కలిసి నటించి, తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని, భారీ ఫ్యాన్ బేస్ ను ఏర్పరచుకుంది ఈ భామ.

- Advertisement -

ఈ భామకు ఫ్యాన్స్ ”Ageing like a fine wine” అని ఓ ట్యాగ్ ని కూడా ఇచ్చారు. వైన్ తయారు చేసిన తరువాత ఎంత ఎక్కువ కాలం ఆగితే రుచి అంత ఎక్కువ గా ఉంటుంది. అలాగే ఈమె వయసు పెరిగే కొద్దీ అందం పెరుగుతుంది. అందుకే ఈ బ్యూటీకి ట్యాగ్ ను ఇచ్చారు.

ఓ హీరోయిన్.. ఒక హీరో తో రెండు సినిమాలు చేయటం మాములు విషయమే. కానీ ఆ రెండు సినిమాలకి గ్యాప్ 14 ఏళ్ళు అంటే మాములు విషయం కాదు. త్రిష – విజయ్ దళపతి జోడి గా 14ఏళ్ల ముందు ఝీల్ అనే తమిళ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ పొందారు. అయితే ఇప్పుడు అదే జోడీ దళపతి67 తో మరోసారి అలరించడానికి వస్తున్నారు. విజయ్ 67వ సినిమాలో లీడ్ రోల్ లో నటించేందుకు త్రిషను మేకర్స్ ఎంపిక చేసారు. ఈ విషయాన్నీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

14 ఏళ్ల తరువాత ఈ జోడి మళ్లీ తెర మీదకు వస్తుంది అంటే అంచనాలు భారీ స్థాయి లో ఉన్నాయి.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు