Trisha : లాంగ్ గ్యాప్

త్రిష అందానికి మరో రూపం, ఎంతోమంది సినిమా ప్రేక్షకులను తనతో ప్రేమలో పడేసింది.చేసిన ప్రతి సినిమాలోనూ గుర్తుండే పెరఫామెన్స్ ఇస్తుంది.నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు దాదాపుగా స్టార్ హీరోస్ అందరితో జత కట్టింది.
అలానే తమిళ్ కూడా దాదాపు స్టార్ హీరోస్ తో జత కట్టింది త్రిష.

ప్రస్తుతం త్రిష తమిళ్ స్టార్ హీరో విజయ్ సరసన నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం లో విజయ్, థలపతి67 చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో స్టార్ నటి త్రిష చేయబోతోందని సోషల్ మీడియాలో ఒక క్రేజీ గాసిప్ నడుస్తోంది.
ఈ వార్త నిజమైతే చాలా గ్యాప్ తరవాత విజయ్ సరసన కనిపించనుంది త్రిష.అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. నవంబర్ 2022 లో ప్రారంభం కానున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

“నగరం” సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన లోకేష్ వరుస హిట్ సినిమాలు చేసాడు. తన మొదటి సినిమాతోనే రైటింగ్ లోని బ్రిలియన్స్ ను, డైరెక్షన్ లోని టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు.“నగరం” తరువాత హీరో కార్తీ తో చేసిన “ఖైదీ” సినిమా కూడా భారీవిజయాన్ని సాధించింది. ఆ తరువాత ఇళయ దళపతి విజయ్ ను హీరోగా, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ను విలన్ గా పెట్టి తెరకెక్కించిన “మాస్టర్” సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.లోకేష్ దర్శకత్వం లో వచ్చిన విక్రమ్ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ కావడంతో ఇప్పుడు విజయ్ తో చేయబోయే చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు