Trivikram: గురూజీ ప్లానింగ్ అదిరింది

త్రివిక్రమ్ శ్రీనివాస్ , ఈయన మాములుగా మాట్లాడారు, మాట్లాడితే మాత్రం మాములుగా ఉండదు. కేవలం డైలాగ్స్ తో ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించడం ఈయనకు మాత్రమే చెల్లింది.
“అజ్ఞాతవాసి” సినిమా మినహాయిస్తే మిగతా సినిమాలు అన్ని త్రివిక్రమ్ కి మంచి పేరును తీసుకుని వచ్చాయి.

అనుకున్న స్థాయిలో థియేటర్ లో ఆడకపోయినా త్రివిక్రమ్ కెరియర్ లో బెస్ట్ ఫిలిమ్స్ అంటే అతడు, ఖలేజా అంటారు. ఈ రెండు సినిమాల్లో మహేష్ కనబర్చిన నటన ఇప్పటికి ఆడియన్స్ ను ఫిదా చేస్తుంది.
త్రివిక్రమ్ బెస్ట్ రైటింగ్ అంటే ఖలేజా అని చెప్పొచ్చు.

ఈ సినిమా ఒక ఓల్డ్ వైన్, రోజులు పెరిగే కొద్ది టేస్ట్ పెరుగుతుంది.
మహేష్ లోని ఒక పరిపూర్ణమైన నటుడిని బయటకు తీసిన సినిమా ఇది,
రాజు కేరక్టర్ ను త్రివిక్రమ్ డిజైన్ చేసిన విధానం మైండ్ బ్లోయింగ్.
మహేష్ కామిక్ టైమింగ్, వాయిస్ మాడ్యులేషన్ ,డైలాగ్ డెలివరీ తో ఆడియన్స్ కు ఊహించని సప్రైజ్ ఇచ్చాడు,కానీ ఈ సినిమా మాత్రం ఊహించిని విజయాన్ని ఇవ్వలేదు.

- Advertisement -

మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన చెప్పాల్సిన అవసరం లేదు. 2010 లో వచ్చిన ఖలేజా తరువాత మళ్ళీ వీళ్ళ కాంబినేష్ లో సినిమా రాబోతుంది. #SSMB28 పేరుతో తెరకెక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ జులై నుంచి ప్రారంభం కానుంది.
ఈ సినిమాని 2023 సంక్రాంతి కి ప్లాన్ చేస్తున్నారు. మాములుగా సంక్రాంతికి రిలీజయ్యే సినిమాలకు కలక్షన్స్ భారీగా వస్తాయి. అదే సంక్రాంతికి ఒక క్రేజీ కాంబినేషన్ సినిమా వస్తే వసూళ్లు మోత ఒక రేంజ్ లో ఉంటుంది. అందుకే ఈ సినిమాని కూడా పర్ఫెక్ట్ గా సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు