Pooja Hegde : త్రివిక్రమే దిక్కు

పూజ హెగ్డే అతి తక్కువ కాలంలో మంచి పేరు సంపాదించి స్టార్స్ హీరోలతో సినిమాలు చేసింది. అల్లు అర్జున్, మహేష్ బాబు , ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో సినిమాలు చేసిన పూజకి ప్రస్తుతం టాలీవుడ్ లో అవకాశాలు కరువయ్యాయి. ఏదైనా కొంతకాలమే నడుస్తుంది అంటారు.

అతి తక్కువ మంది మాత్రమే ఒకవైపు స్టార్ హీరోస్ తో సినిమాలు చేస్తూ, ఇంకో వైపు నార్మల్ రేంజ్ ఉన్న హీరో లతో సినిమాలు చేస్తారు. వీటికి హీరోయిన్ శ్రీయ మంచి ఉదాహరణ. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, బాలయ్య, చిరంజీవి వంటి స్టార్స్ తో సినిమాలు చేసిన శ్రీయ తరుణ్ లాంటి యంగ్ హీరోస్ తో కూడా సినిమాలు చేసింది. ఆ తరువాత త్రిష, కాజల్, అనుష్క, ఇలియానా లాంటి హీరోయిన్స్ ఇండస్ట్రీలో కొంతకాలం నిలద్రొక్కుకున్నారు.

అలానే రకుల్ ప్రీత్ సింగ్ ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్ రామ్ చరణ్ వంటి స్టార్స్ తో జత కట్టింది. ప్రస్తుతం రకుల్ కి కూడా తెలుగులో అవకాశాలు లేవు. రకుల్ నుంచి చివరగా వచ్చిన కొండపోలం కూడా అంతంత మాత్రమే ఆడింది. బాలీవుడ్ లో ఈ ఏడాది ఐదు సినిమాలు చేసిన ఏవి సరైన విజయాన్ని అందించలేదు.

- Advertisement -

ఇప్పుడు రకుల్ మాదిరిగానే పూజకు తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. రీసెంట్ పూజ నటించిన సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు రాధేశ్యాం, బీస్ట్, ఆచార్య సినిమాలు నిరాశను మిగిల్చినవే.
మళ్ళీ ఇప్పుడు పూజ హీరోయిన్ నిలద్రొక్కుకోవాలంటే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న సినిమాతో హిట్ అందుకోవాలి. లేదంటే ఇకపై అవకాశాలు కష్టమే అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు